పూనమ్ ని వదిలేది లేదు!

ఆమె డ్రామాను కొందరు సమర్ధిస్తే కొందరు మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు. ముంబైకి చెందిన ఒక న్యాయవాది ఆమెపై మరియు ఆమె మేనేజర్‌ పై కేసు నమోదు చేశాడు.

Update: 2024-02-05 04:50 GMT

బాలీవుడ్‌ స్టార్ పూనమ్ పాండే ఇటీవల మృతి చెందినట్లుగా ఆమె మేనేజర్‌ నికితా శర్మ ప్రకటించిన విషయం తెల్సిందే. చిన్న వయసులోనే పూనమ్‌ పాండే సర్వికల్‌ క్యాన్సర్ తో మృతి చెందినట్లు ఆమె మీడియా కు సమాచారం ఇచ్చింది. పూనమ్ అధికారిక మేనేజర్‌ నుంచి మెసేజ్ రావడంతో అంతా కూడా నమ్మారు.

జాతీయ మీడియా నుంచి స్థానిక మీడియా వరకు పూనమ్‌ పాండే మరణం పై పెద్ద ఎత్తున కథనాలు రాయడం జరిగింది. ఆమెకు ప్రముఖులు సైతం శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె గురించి సోషల్‌ మీడియాలో అభిమానులు తమ అభిమానాన్ని పంచుకుంటూ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్‌ చేశారు. అంత జరిగిన తర్వాత పూనమ్ పాండే చనిపోలేదు అంటూ వీడియోను విడుదల చేశారు.

పూనమ్ పాండే వీడియో విడుదల తర్వాత వివాదం రాజుకుంటోంది. సర్వికల్‌ క్యాన్సర్‌ అవగాహణలో భాగంగా తాను ఇలా చేశాను అంటూ పూనమ్‌ పాండే చెప్పింది. ఆమె డ్రామాను కొందరు సమర్ధిస్తే కొందరు మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు. ముంబైకి చెందిన ఒక న్యాయవాది ఆమెపై మరియు ఆమె మేనేజర్‌ పై కేసు నమోదు చేశాడు.

మీడియా ను జనాలను తప్పుదోవ పట్టించే విధంగా పూనమ్ పాండే మరియు ఆమె మేనేజర్ నికితా శర్మ ప్రవర్తించారు అంటూ ఆయన ఆరోపిస్తున్నాడు. మరణ వార్త ను మీడియా కు ఇవ్వడం ద్వారా అసత్యాలు ప్రచారం చేసినట్లు అయ్యిందని, అందుకు గాను వారిపై కేసు పెట్టాల్సిందే అని, శిక్ష పడే వరకు పూనమ్ ని వదిలేది లేదు అన్నట్లుగా ఆ న్యాయవాది అంటున్నాడు.

మీడియాతో పాటు అన్ని వర్గాల వారిని కూడా తప్పుదోవ పట్టించినందుకు గాను ఆమెకి కఠిన శిక్ష ను కోర్టు విధిస్తుందని తాను భావిస్తున్నట్లు న్యాయవాది పేర్కొన్నాడు. అయితే ఈ విషయంలో ఆమెకు పలువురు మద్దతు తెలుపుతూ న్యాయవాది తీరును విమర్శిస్తున్నారు.


Tags:    

Similar News