పొట్టి డ్రెస్ లో కేథరిన్. మైండ్ బ్లాక్

శంకర్ ఐపీఎస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కేథరిన్.. టాలీవుడ్ లోకి వరుణ్ సందేశ్ చమ్మక్ చల్లో మూవీతో ఎంట్రీ ఇచ్చింది.

Update: 2024-08-31 17:30 GMT

గ్లామర్, యాక్టింగ్.. ఈ రెండూ ఉన్నా కొందరు హీరోయిన్లకు లక్ మాత్రం కలిసి రావడం లేదన్నది అక్షరాలా నిజమే! ఆ లిస్ట్ లో బ్యూటీ కేథరిన్ థ్రెసా తప్పకుండా ఉంటుంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మడు.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. శంకర్ ఐపీఎస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కేథరిన్.. టాలీవుడ్ లోకి వరుణ్ సందేశ్ చమ్మక్ చల్లో మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనూహ్యంగా స్టార్ హీరో అల్లు అర్జున్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది.


పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇద్దరమ్మాయిలతో మూవీలో నటించిన కేథరిన్.. ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది. సినిమాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసి.. యూత్ ను ఆకట్టుకుంది. మంచి హిట్ అందుకుంది. కానీ సక్సెస్ జోష్ ను కొనసాగించలేకపోయింది. పైసా, రుద్రమదేవి, ఎర్ర బస్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసినా.. అవన్నీ ఫ్లాపులుగా నిలిచాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు బాగా తగ్గాయి. అప్పుడే కోలీవుడ్, శాండల్ వుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అమ్మడు.


తమిళంలోకి కార్తీ మద్రాస్ మూవీతో అడుగుపెట్టిన బ్యూటీ.. మంచి హిట్ అందుకుంది. కన్నడలో ఉపేంద్ర హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ చిత్రంతో తన పాపులారిటీని మరింత పెంచుకుంది. మళ్లీ తెలుగులోకి సరైనోడు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన కేథరిన్.. చిత్రంలో ఎమ్మెల్యే పాత్రలో కనిపించి అదరగొట్టింది. ఆ తర్వాత నేనే రాజు నేనే మంత్రిలో ఓ రోల్, జయ జానకీ నాయకలో ఐటెం సాంగ్ చేసింది. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.


చివరగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన వాల్తేర్ వీర‌య్య‌లో రవితేజ భార్యగా కనిపించిన కేథరిన్.. ఇప్పుడు తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. సినిమాలు తగ్గినా.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో సందడి చేస్తోంది అమ్మడు. ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ షేర్ చేస్తూ అలరిస్తుంటోంది. తన అందాలను ఆరబోసి యూత్ ను అట్రాక్ట్ చేస్తుంటోంది. స్టన్నింగ్ పిక్స్ పోస్ట్ చేసి ఫిదా చేస్తుంటోంది. అలా తన ఫాలోవర్స్ ను పలకరిస్తూ ఉంటోంది కేథరిన్.


తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది అమ్మడు. పొట్టి నిక్కరు, షార్ట్ టాప్ లో మైమరిపిస్తోంది. వెరైటీ పోజులు ఇస్తూ అందరినీ ఫ్లాట్ చేస్తోంది. తన అందాలతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె కొత్త పిక్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేథరిన్ ఫోటోలు అదిరిపోయాయని నెటిజన్లు చెబుతున్నారు. లైకుల వర్షం కురిపిస్తున్నారు. పొగడ్తలతో కామెంట్ సెక్షన్ నింపుతున్నారు. అందానికి పర్యాయ పదం అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.

Tags:    

Similar News