వైద్యుల‌తో వివాదం: సామ్‌కు తార‌ల గ‌ట్టి మ‌ద్ధ‌తు

అయితే ఇది ధ‌ర్మ వైద్యుల‌కు రుచించ‌లేదు. X ఖాతాలో ప‌లువురు వైద్యులు స‌మంత‌పై దుమ్మెత్తిపోశారు. త‌మ పొట్ట కొడుతున్న ఆవేద‌న వైద్యుల్లో కనిపించింది

Update: 2024-07-06 07:13 GMT

వైరల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే హైడ్రోజన్ పెరాక్సైడ్ కోసం నెబ్యులైజర్‌ను ఉపయోగించాల‌ని త‌న అభిమానుల‌కు, ప్ర‌జ‌ల‌కు సూచించారు స‌మంత రూత్ ప్ర‌భు. చాలా ఖ‌ర్చు చేస్తేనే కానీ, కొన్ని ర‌కాల మెడిసిన్స్ సామాన్యుల‌కు అంద‌వ‌ని, అందినా కొన్నిసార్లు రుగ్మ‌త‌లు త‌గ్గ‌వ‌ని, అనుభ‌వంతో త‌న సూచ‌న‌లు స‌ల‌హాలు ఇచ్చారు. ఈ విష‌యంలో తాను చాలా అదృష్ట‌వంతురాలిన‌ని, ఖ‌రీదైన వైద్యాన్ని తాను మాత్రం చేయించుకోగ‌లిగాన‌ని అన్నారు. మాత్ర‌లు మింగే కంటే నెబ్యులైజ‌ర్ ని స‌రైన విధానంలో ఉప‌యోగించాల‌ని ప్ర‌త్యామ్నాయాన్ని సూచించింది. అయితే ఇది ధ‌ర్మ వైద్యుల‌కు రుచించ‌లేదు. X ఖాతాలో ప‌లువురు వైద్యులు స‌మంత‌పై దుమ్మెత్తిపోశారు. త‌మ పొట్ట కొడుతున్న ఆవేద‌న వైద్యుల్లో కనిపించింది. ఒక వైద్యుడు అదే ప‌నిగా సమంత‌పై వ్యాఖ్య‌ల దాడి చేసాడు. స‌మంత‌ను జైల్లో వేయాల‌ని కూడా కోపాన్ని ప్ర‌ద‌ర్శించాడు. అయితే దీనికి సమంతా వివరణాత్మక నోట్‌తో మ‌ళ్లీ సోష‌ల్ మీడియాల్లో స్పందించారు. ఇప్పుడు, వరుణ్ ధావన్, కియారా అద్వానీ స‌హా చాలా మంది న‌టీన‌టులు స‌మంత‌కు మ‌ద్ధ‌తుగా నిలిచారు.

సెలబ్రిటీలు చాలా మంది సమంతా రూత్ ప్రభు ఇటీవలి పోస్ట్‌పై స్పందించారు. చాలా మంది సెలబ్రిటీలు స‌మంత ఆలోచ‌నా విధానానికి ఆక‌ర్షితులై ప్రేమగా మద్దతునిచ్చారు. `బంగాళాదుంపలు పొటాటోస్‌గా మారాయి` అని రియా చక్రవర్తి వ్యాఖ్యానించారు. కియారా అద్వానీ, తాహిరా కశ్యప్, రకుల్ ప్రీత్ సింగ్, మానుషి చిల్లర్‌ సహా పలువురు ఇతర ప్రముఖులు స‌మంత‌ పోస్ట్‌ను ఇష్టపడ్డారు. వరుణ్ ధావన్ కామెంట్స్‌లో హార్ట్ ఎమోజీని కూడా షేర్ చేసారు.

త‌న‌ను ఉద్ధేశ‌పూర్వ‌కంగా టార్గెట్ చేసిన వైద్యుని గురించి స‌మంత ఇలా రాసింది. ``ఒక పెద్దమనిషి నా పోస్ట్‌పై .. నా ఉద్దేశాలపై బలమైన పదాలతో దాడి చేశాడు. పెద్దమనిషి డాక్టర్ ని అని కూడా చెప్పాడు. అతడికి నాకంటే ఎక్కువ తెలుసు అనడంలో సందేహం లేదు. అతడు తన మాటలతో రెచ్చగొట్టకుండా ఉంటే అది అతని పట్ల దయగా ఉండేది. X ఖాతాలో TheLiverDoc హ్యాండిల్‌ని ఉపయోగించే ఒక వైద్యుడు, శ్వాసకోశ వైరల్ ఇన్‌ఫెక్షన్‌లను నివారించడానికి , చికిత్స చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని పీల్చమని తన మిలియన్ల మంది అనుచరులకు సలహా ఇచ్చినందుకు సమంతా రూత్ ప్రభుని విమర్శించారు. అతడు ఇలా రాసాడు, ``హేతుబద్ధమైన శాస్త్రీయంగా ఎదిగిన‌ ప్రగతిశీల సమాజంలో ఈ మహిళ ప్రజారోగ్యానికి హాని కలిగించే స‌ల‌హా ఇచ్చినందుకు త‌న‌పై అభియోగాలు మోపాలి. జరిమానా వేయాలి. కటకటాల వెనుక్కి పంపాలి. ఆమెకు సహాయం చేసేవారు లేదా ఆమె బృందంలో మంచి సలహాదారు కావాలి`` అని ఒక వైద్యుడు తీవ్రంగా ఎటాక్ చేసాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.... సమంత తన త‌దుప‌రి వెబ్ సిరీస్ `సిటాడెల్: హనీ బన్నీ` రిలీజ్ కోసం వేచి చూస్తోంది. వ‌రుస‌గా ప్రాజెక్టుల‌కు క‌మిటైంది. సొంత బ్యాన‌ర్ లోను నిర్మాత‌గా ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News