పూనమ్ పాండే ఎంట్రీపై కేంద్రం క్లారిటీ!
పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లతో పాటూ పాండే పేరును కూడా ప్రభుత్వం సీరియస్ గానే ఆలోచన చేస్తుందని తెరపైకి వచ్చింది.
సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలకు ప్రచారకార్తగా బాలీవుడ్ నటి..మోడల్ పూనమ్ పాండే పేరును కేంద్రం పరిశీలిస్తోందని ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లతో పాటూ పాండే పేరును కూడా ప్రభుత్వం సీరియస్ గానే ఆలోచన చేస్తుందని తెరపైకి వచ్చింది. యువత లో ఆమెకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ప్రభుత్వం పూనమ్ పాండే పేరును ప్రకటించిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వినిపించింది. అయితే తాజాగా ఈ ప్రచారంపై ప్రభుత్వ అధికారులు స్పందించారు.
పూనమ్ పాండే పేరు తమ పరిశీలనలో లేదని స్పష్టం చేసారు. కేంద్ర ప్రభుత్వంతో పూనమ్ పాండే ఆమె టీం చర్చలు జరుపుతోందన్న వస్తోన్న వార్తలు అవాస్తవమని..వాటిని ఎవరూ నమోద్దని కథనాల్ని అధి కారుల కొట్టిపారేసారు. దీంతో పూనమ్ పాండే కి ప్రచార కర్తగా ఛాన్స్ లేదని తేలిపోయింది. ఇక సర్వైకల్ క్యాన్సర్ పేరుతో ఇటీవల పూనమ్ ఎంత హడావుడి చేసిందోతెలిసిందే. సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించి నట్టు ఇటీవల వదంతి సృష్టించిన పెద్ద సంచలనానికే తెర తీసింది.
దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమెకి సంతాపం ప్రకటించడం..ప్రత్యేక కథనాలు హడావుడి చాలానే జరిగింది. దీంతో ఆమరుసటి రోజు తాను చనిపోలేదని..అవేర్ నెస్ కార్యక్రమం కోసం ఇలాంటి ప్రచారానికి తెర తీసానని సీన్ లోకి వచ్చింది. దీంతో పూనమ్ పాండేని దూషించని వారంటూ లేరు. ప్రచారం కోసం చివరికి చచ్చిపోయాననని చెప్పుకోవడం ఎంత నీచమైన పని అంటూ నెటి జనులు మండిపడ్డారు.
దీంతో పూనమ్ పాండే అందర్నీ క్షమాపణలు కోరింది. ఈ రకమైన తంతు తర్వాత ప్రభుత్వం ఆమె పేరును పరిశీలిస్తుందని ప్రచారం జరగడంతో ఛాన్సెస్ లేకపోలేదని కొంత మంది నమ్మారు. కానీ అదే ప్రచారం పూనమ్ పాండేకి ఈ అవకాశాన్ని దూరం చేసిందని నమ్ముతున్న వారు ఉన్నారు. ఈ చర్యలకు పాల్పడకు ముందు పూనమ్ పేరును కూడా ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుందేమో! అదే చర్యకు దిగడంతో అధికారులు ఆ ఆలోచన కూడా విరమించుకునే అవకాశం లేకపోలేదుగా అంటున్నారు.