చై-శోభిత పెళ్లి తేదీ వెన్యూ వివ‌రాలు

ఈ వివాహం హైదరాబాద్‌లో జరగనుందని, నాగ చైతన్య కుటుంబం ఎఫైర్ సింపుల్‌గా ఉండాలని కోరుకుంటున్నారని గుస‌గుస వినిపిస్తోంది.

Update: 2024-11-04 13:21 GMT

కింగ్ నాగార్జున ఇంట శుభ‌కార్యానికి ముహూర్తం ద‌గ్గ‌ర‌ప‌డింది. అక్కినేని నాగ‌చైత‌న్య -శోభితా ధూళిపాళ వివాహానికి సుముహూర్తం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవలే వివాహ ఆచారాలు ప్రారంభమయ్యాయి. స్టార్ క‌పుల్ అక్కినేని జాతీయ అవార్డ్స్ ఉత్స‌వాల్లో ఎంతో ఉల్లాసంగా క‌నిపించారు.

తాజా స‌మాచారం మేర‌కు.. వీరి పెళ్లి వేడుక చాలా సింపుల్ గా ఉండాల‌ని భావిస్తున్న‌ట్టు తెలిసింది. ఈ వివాహం హైదరాబాద్‌లో జరగనుందని, నాగ చైతన్య కుటుంబం ఎఫైర్ సింపుల్‌గా ఉండాలని కోరుకుంటున్నారని గుస‌గుస వినిపిస్తోంది. ఇరు పార్టీలు ఈ విధానాన్ని ఇష్టపడుతున్నార‌ని తెలిసింది. సంబంధిత కుటుంబాలు త్వరలో మరింత సమాచారాన్ని రివీల్ చేయ‌నున్నాయి.

చైతు - శోభిత జంట వివాహానికి ఇంకా నెల‌రోజుల స‌మ‌యం ఉంది. ఈలోగా మ‌రిన్ని అప్ డేట్స్ ని తెలుసుకునే వీలుంది. ఈవెంట్ కోసం వెడ్డింగ్ సెట్‌ను అన్న‌పూర్ణ స్టూడియోలో నిర్మిస్తున్నార‌ని ఇండియా టుడే ఒక క‌థ‌నంలో పేర్కొంది. 4 డిసెంబర్ 2024న ఎటువంటి హంగామా లేకుండా ఇరువైపులా కుటుంబ స‌భ్యులు, ఎంపిక చేసిన బంధుమిత్రుల స‌మ‌క్షంలో సింపుల్ గా జ‌ర‌గ‌నుంద‌ని ఫిలింవ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

చైతూ ప్ర‌స్తుతం చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తండేల్ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత భారీగా విడుల కానుంది. శోభిత ధూళిపాల త‌దుప‌రి ప్రాజెక్టుల గురించి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

Tags:    

Similar News