మిస్టరీ థ్రిల్లర్ లో చైతూ.. ఆ డైరెక్టర్ తోనే..

ఉత్తరాంధ్రకు చెందిన కొందరు మత్స్యకారుల నిజ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Update: 2024-03-25 15:36 GMT

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య.. అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన జోనర్లలో సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని జోనర్లను టచ్ చేసిన చైతూ.. ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు మత్స్యకారుల నిజ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ప్రస్తుతం నాగచైతన్య సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. తండేల్ మూవీతో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. అందుకోసం చాలా కష్టపడుతున్నారు. రీసెంట్ గా నాగచైతన్య నటించిన కస్టడీ, థ్యాంక్యూ మూవీలు డిజాస్టర్లుగా మారాయి. ఆ తర్వాత ఫేమస్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన దూత వెబ్ సిరీస్ హిట్ టాక్ సంపాదించుకుంది. పలు రికార్డులను కూడా క్రియేట్ చేసింది.

తండేల్ తో సూపర్ హిట్ కొట్టాలని ట్రై చేస్తున్న చైతూ.. ఆ సినిమా షూటింగ్ టైమ్ లో వేరే ఏ ఒక్క స్టోరీ కూడా వినడానికి ఇష్టపడలేదట. ఇప్పుడు ఆ సినిమా అవుట్ పుట్ పర్ఫెక్ట్ గా వస్తోందట. మూవీ హిట్ అవుద్దని మేకర్స్ నమ్మకంతో ఉన్నారట. దీంతో చైతూ తన కొత్త సినిమాలపై దృష్టి పెట్టారట. పలువురు యంగ్ డైరెక్టర్లతో చర్చలు జరిపారట. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.

గత కొద్దిరోజులుగా నాగచైతన్య.. విరూపాక్షతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కార్తీక్ వర్మ దండుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్టోరీని చైతూకు కార్తీక్ వివరించగా ఓకే చెప్పేశారట. ఈ సినిమా మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కనుందట. 2024 చివర్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందట. విరూపాక్ష నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించనున్నారట. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన రానుందట.

తండేల్ సినిమా అక్టోబర్ లో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తండేల్ మూవీ సక్సెస్ పై ధీమాగా ఉన్నప్పటికీ.. కొత్త చిత్రాల విషయంలో నాగచైతన్య ఆచితూచి అడుగులు వేస్తున్నారట. శివ నిర్వాణ, రాహుల్ సంకృత్యాన్ వంటి యువ దర్శకులతో చైతూ చర్చించినట్లు తెలుస్తోంది. మరి ఫ్యూచర్ లో నాగచైతన్య ఎవరితో సినిమాలు తీయనున్నారో.. అవి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో చూడాలి.

Tags:    

Similar News