తండెల్ 'చైతూ'.. పక్కా లోకల్ బాయ్

టాలీవుడ్ కుర్ర హీరోలు ప్రస్తుతం తమ మార్కెట్ ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Update: 2024-05-22 12:16 GMT

టాలీవుడ్ కుర్ర హీరోలు ప్రస్తుతం తమ మార్కెట్ ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కొత్త కథలని ఎంపిక చేసుకుంటున్నారు. యూనివర్శల్ కాన్సెప్ట్ లతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కూడా అదే రూట్లో వెళుతున్నాడు. ఇక ప్రస్తుతం కొత్త లుక్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.


ఈ సినిమా కోసం ఫుల్ గా గెడ్డం పెంచేసి మాస్ లుక్ లో దర్శనం ఇస్తున్నాడు. రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితో ఈ మూవీ తెరకెక్కుతూ ఉంది. భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో చైతూకి జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. గెడ్డంతో నాగ చైతన్య లుక్స్ చాలా మాసివ్ గా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. చైతూ రాజు ఒక మత్య్సకారుడి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.

ఇక లేటెస్ట్ స్టిల్ లో బోటులో నవ్వుతూ కనిపించిన చైతన్య తాడును పట్టుకొని ఉన్నాడు. మెడలో ఎర్రటి తుండుతో పక్కా లోకల్ అనేలా దర్శనమిచ్చాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండేల్ సినిమా షూటింగ్ సెట్ లో ఈ ఫోటో దిగినట్లు తెలుస్తోంది. తండేల్ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ కి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కచ్చితంగా ఈ సినిమాతో నాగ చైతన్య బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడనే మాట వినిపిస్తోంది. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ నడవబోయే ఈ మూవీలో చైతన్య ఫిషర్ మెన్ గా కనిపించబోతున్నాడు. తండేల్ సినిమాలో చైతూ లుక్ కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది.

ఈ సినిమా తర్వాత విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ కూడా విరూపాక్ష తరహాలోనే థ్రిల్లర్ జోనర్ లో ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. కార్తిక్ దండు విరూపాక్షతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో చైతూతో కార్తీక్ దండు చేయబోయే సినిమా ఎలా ఉండబోతోందా అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.

ఈ ఏడాదిలోనే కార్తీక్ దండు దర్శకత్వంలో మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తండేల్ మూవీ ఈ ఏడాది ఆఖరులో డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకి రానుంది. తండేల్ సినిమా సక్సెస్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో నాగ చైతన్య మార్కెట్ అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది. మరి అతను ఎలాంటి రికార్డులు అందుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News