అలా డిసైడ్ అయ్యింది కాబట్టి అలాంటి సినిమాలు చేస్తుందా..?

అయితే ఈ తరం కథానాయికలు మాత్రం సొంత భాషలో ఎలాగైనా రాణించాలనే కసి పెరిగింది.

Update: 2024-04-22 05:46 GMT

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అంత గొప్ప అవకాశాలేవి రావు. ఒకరిద్దరు తమ సత్తా చాటాలని చూసినా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేరు. మన తెలుగు అమ్మాయిలకు తమిళ పరిశ్రమలో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఈ తరం కథానాయికలు మాత్రం సొంత భాషలో ఎలాగైనా రాణించాలనే కసి పెరిగింది. అందుకే చాందిని చౌదరి, వైష్ణవి చైతన్య లాంటి వారు క్రేజ్ తెచ్చుకుంటున్నారు.


షార్ట్ ఫిలింస్ లో నటించి సినిమాలకు ప్రమోట్ అయిన ఈ ఇద్దరు ఇప్పుడు తెలుగులో తమ సత్తా చాటుతున్నారు. వైష్ణవి చైతన్య చేసిన బేబీ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకోగా ఆమె చేతిలో దాదాపు అరడజను సినిమాల దాకా ఉన్నాయని తెలుస్తుంది. వైష్ణవి కన్నా ముందే చాందిని చౌదరి సినిమాల్లోకి వచ్చినా అమ్మడు కమర్షియల్ సినిమాల కన్నా ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ అలరిస్తుంది.

రీసెంట్ గా వచ్చిన గామి సినిమాతో మరోసారి తన కథల ఎంపికలో ప్రతిభ కనబరచింది చాందిని చౌదరి. రీసెంట్ ఇంటర్వ్యూలో గామి గురించి చెబుతూ ఈ సినిమాలో నటించడం ఒక గొప్ప ఎక్స్ పీరియన్స్ అని.. ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ సినిమాల్లో నటించడం రెండోసారి అని చెప్పింది. అంతేకాదు కథల విషయంలో బౌండరీస్ దాటి సినిమాలు చేయాలని అంటుంది చాందిని. ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతాను అందుకే తాను సెలెక్టెడ్ సినిమాలు చేస్తానని అంటుంది చాందిని.

అలాంటి సినిమాలు డిసైడ్ అయ్యింది కాబట్టే చాందిని కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటుందా అంటే అలా కాదు కానీ తన సినిమాల ఎంపికలో మొదటి ప్రియారిటీ మాత్రం అదే అని అంటుంది అమ్మడు. గామి షూటింగ్ టైం లో చాందిని చౌదరి పడిన కష్టం గురించి విశ్వక్ సేన్ చెప్పిన మాటలు వింటేనే సినిమా కోసం చాందిని ఎంత కష్టపడుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రయోగాలు చేయడం మంచిదే కానీ హీరోయిన్ గా మైలేజ్ పెంచుకోవాలంటే మాత్రం కమర్షియల్ సక్సెస్ లు అవసరం. గామి చూసిన తర్వాత చాందిని సినిమాల సెలక్షన్ గురించి కొందరు ఆడియన్స్ సూపర్ అనేస్తున్నారు. అయితే కెరీర్ స్ట్రాంగ్ అవ్వాలంటే మాత్రం వీటితో పాటుగా కమర్షియల్ సినిమాలతో కూడా అమ్మడు రాణించాల్సి ఉంటుంది. మరి చాందిని చౌదరికి కెరీర్ పరంగా బూస్టింగ్ ఇచ్చే సినిమా పడాలని ఆమె ను అభిమానించే ఆడియన్స్ కోరుతున్నారు.

Tags:    

Similar News