సీనియర్ ఎన్టీఆర్ తోనే విబేధించిన చంద్రమోహన్!
తెలుగు పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కి తరలించినప్పుడు తమని కూడా హైదరాబాద్ వచ్చేయాలని ఎన్టీఆర్ అడిగారుట.
ఇండస్ట్రీలో చంద్రమోహన్ కి బెస్ట్ ప్రెండ్ నట భూషణ్ శోభన్ బాబు. ఇద్దరి మధ్య `ఉరేయ్` అనుకునేంత స్నేహం ఉంది. ఆస్నేహం ఎంత బలంగా ఉండేది? అంటే ఒకానొక సమయంలో శోభన్ బాబు కోసం ఏకంగా ఎన్టీఆర్ నే కాదనే స్థాయికి వచ్చారు చంద్రమోహన్. తెలుగు పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కి తరలించినప్పుడు తమని కూడా హైదరాబాద్ వచ్చేయాలని ఎన్టీఆర్ అడిగారుట.
కానీ ఆ సమయంలో శోభన్ బాబు సైలెంట్ గా ఉన్నా! చంద్రమోహన్ మాత్రం నిర్మొహమాటంగా రాము అని బధులిచ్చినట్లు పాత ఇంటర్వ్యూలో తెలిపారు. ఇండస్ట్రీ మొత్తానికి ఇద్దరమే హైదరాబాద్ రాము అని అన్నాం. మాకు వేశాలు వస్తే విమానంలో వస్తాం. మా లాడ్జింగ్ లో మేము ఉంటాం. కుటుంబాలతో హైదరాబాద్ షిప్ట్ అవ్వడం అంటే కుదరని పని. దానికి ఆయన ఆదేంటి బ్రదర్? మీలాంటి
సీనియర్లు రాకపోతే ఎలా? మీరంతా నవతరానికి రోల్ మోడల్స్ గా ఉండాలి అని రామారావు గారు అన్నారు.
అప్పటికే రామారావు గారు సీఎంగా ఉన్నారు. దీంతో నా వ్యక్తిగత కారణాలతో రాలేను అని చెప్పాను. చెన్నైలో ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. పిల్లలు అక్కడే పుట్టారు. అక్కడే ఆస్తులు సంపాదించా. ఇన్ని వదులుకుని సినిమాల కోసం హైదరాబాద్ రావడం కరెక్ట్ కాదని సరదాగా వారించాను` అన్నారు. హైదరాబాద్ కి షిప్ట్ అయిన తర్వాత ఫిల్మ్ నగరం ఏర్పడటం అందులో చంద్రమోహన్ కి కూడా ఓ ప్లాట్ వచ్చింది.
దీంతో అందులో ఆయన ఓ చిన్న గెస్ట్ హౌస్ కట్టానని.. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు అందులో నే బస ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తు చేసారు. ఆ తర్వాతి కాలంలే అదే గెస్ట్ పెద్ద ఇల్లుగా మార్చారు. ఇప్పుడు అదే ఇంట్లో చంద్రమోహన్ పార్దీవదేహాన్ని ఉంచారు.