నాలుగేళ్ల నుంచి గుండె సమస్యతో చంద్రమోహన్
అయితే ఆయన మరణం నేపథ్యంలో చంద్రమోహన్ కుటుంబ సభ్యులు అరోగ్యానికి సంబంధించిన విషయాలు మీడియాకి వెల్లడించారు.
ఉదయమే సీనియర్ నటుడు చంద్రమోహన్ హఠాన్మరణ వార్త పరిశ్రమ సహా ప్రేక్షకుల్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆయనకేం బాగానే ఉన్నాడు..ఆరోగ్యంగా సినిమాలు చేస్తున్నాడు? ఆయన మరణించడం ఏంటి? అని అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చంద్రమోహన్ అనారోగ్యానికి గురైనట్లు గతంలో వార్తలు వచ్చాయి గానీ.. ఆరోగ్యం పరంగా పూర్తి సమాచారం లేకపోవడంతో! మీడియా కథనాల్లోనూ వాస్తవం ఏంత? అని ఓ సందేహం ఉండేది.
అయితే ఆయన మరణం నేపథ్యంలో చంద్రమోహన్ కుటుంబ సభ్యులు అరోగ్యానికి సంబంధించిన విషయాలు మీడియాకి వెల్లడించారు. `గత నాలుగేళ్ల నుంచి చంద్రమోహన్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స తీసుకుండగానే కిడ్నీలపై ప్రభావం పడింది. ఈరోజు ఉదయం సొమ్మసిల్లి పడిపోయారు .దీంతో ఎనిమిది గంటలకు అపోలో ఆసుపత్రికి హుటాహుటిన తరలించాం. 9.45 గంటలకు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు అని చంద్రమోహన్ మేనల్లుడు కృష్ణప్రసాద్ తెలిపారు.
ఇద్దరు కుమార్తెల్లో ఒక కుమార్తె చెన్నైలో ఉంటున్నారు. అయితే చిన్న కుమార్తె అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె అక్కడ నుంచి హైదరాబాద్ కి రావాల్సి వుంది. ఇప్పటికే విషయం తెలియడంతో ఆమె బయల్దేరే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నటన్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
2004లో `రాఖీ` సినిమా పూర్తయిన వెంటనే చంద్రమోహన్ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆ తర్వాత `దువ్వాడ జగన్నాధమ్` సినిమా టైమ్ లోనే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కున్నారు. చివరిగా గోపీచంద్ హీరోగా నటించిన `ఆక్సిజన్` సినిమా తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు.