ఛాంగురే బంగారు రాజా.. మాస్ రాజా టీమ్ పాజిటివ్ వైబ్
తాజాగా తెలుగులో సతీష్ వర్మ దర్శకత్వంలో ఛాంగురే బంగారు రాజా మూవీ చేశారు. కార్తిక్ రత్నం, సత్య, రవిబాబు లీడ్ రోల్ లో ఈ మూవీ తెరకెక్కింది
మాస్ మహారాజ్ రవితేజ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే ఈ మధ్యకాలంలో రవితేజ టీం వర్క్ అనే బ్యానర్ స్టార్ట్ చేసి నిర్మాతగా బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. కొత్త దర్శకులకి అవకాశం ఇస్తున్నారు. ఈ బ్యానర్ లో రవితేజ మట్టికుస్తి సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. తాజాగా తెలుగులో సతీష్ వర్మ దర్శకత్వంలో ఛాంగురే బంగారు రాజా మూవీ చేశారు. కార్తిక్ రత్నం, సత్య, రవిబాబు లీడ్ రోల్ లో ఈ మూవీ తెరకెక్కింది.
క్రైమ్, కామెడీ జోనర్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. రవితేజ తన బ్యానర్ లో కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వనున్నట్లు ఈ సినిమాతోనే చెప్పారు. హీరోగా రవితేజ చాలా మంది కొత్త దర్శకులని టాలీవుడ్ కి పరిచయం చేశారు. ఇప్పుడు నిర్మాతగా కూడా అదే దిశగా అడుగులు వేస్తూ ఉండటం విశేషం.
కేరాఫ్ కంచరపాలెం సినిమాలో చైల్డ్ యాక్టర్ గా చేసిన నిత్య శ్రీ, షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న కుషిత కళ్లపు లీడ్ హీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. పలు హిట్ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన సతీష్ వర్మ ఈ చిత్రంతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతన్నాడు. టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న కార్తిక్ రత్నంకి కూడా ఛాంగురే బంగారు రాజా సినిమాతో కమర్షియల్ బ్రేక్ వచ్చే అవకాశం ఉందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.
ఇక మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ గా కూడా కొత్తవాళ్లే ఈ సినిమాతో పరిచయం అవుతూ ఉండటం విశేషం. రవితేజ కొత్త వాళ్ళ మీద బడ్జెట్ కూడా ఎక్కువగానే పెట్టి ఛాంగురే బంగారు రాజా సినిమా చేసాడని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్ గా ఉండటం. అలాగే ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఉండటం మూవీపై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోంది. కచ్చితంగా ప్రేక్షకులకి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరి ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఈ సినిమాకి రవితేజతో పాటు నిర్మాణ భాగస్వామిగా ఉంది. మరి వీరందరి ప్రయత్నాన్నికి ప్రేక్షకులు ఎలాంటి రిజక్ట్ ఇస్తారో చూడాలి.