ఆ సినిమా చేసుండకూడదన్న చరణ్..!

గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవుతుంది.

Update: 2025-01-08 04:18 GMT

చిరు తనయుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ 15 సినిమాల అనుభవంతోనే గ్లోబల్ స్టార్ రేంజ్ కి వెళ్లాడు. మెగా ఫ్యాన్స్ ని అలరించేలా సినిమాలు చేస్తూ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు చరణ్. RRR తో సాధ్యం కాదు అనుకున్న మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమాను కూడా తన వంతుగా అదరగొట్టేశాడు చరణ్. ఐతే లేటెస్ట్ గా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నాడు రామ్ చరణ్. అన్ స్టాపబుల్ షోలో ఏ గెస్ట్ వచ్చినా సరే వారితో సరదాగా మాట్లాడుతూ ఎంటర్టైన్ చేస్తున్నారు బాలయ్య. లేటెస్ట్ గా రామ్ చరణ్ తో కూడా స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు. నేడు ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఐతే ఈ క్రమంలో చరణ్ తో బాలయ్య ఏ సినిమా విషయంలో రిగ్రెట్ ఫీల్ అయ్యావ్ అన్న ప్రశ్న ఎదురైంది. దానికి రామ్ చరణ్ జంజీర్ అని ఆన్సర్ ఇచ్చాడు.

అపూర్వ లఖియా డైరెక్షన్ లో తెరకెక్కిన జనీర్ సినిమా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ జంజీర్ కి రీమేక్ గా వచ్చింది. రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ గా నిలిచింది. బాలీవుడ్ లో చరణ్ చేసిన తొలి సినిమా అదే. ఐతే ఆ సినిమా ఇచ్చిన రిజల్ట్ తెలిసిందే. అందుకే రామ్ చరణ్ ఆ సినిమా చేసి ఉండకూడదనే రిగ్రెట్ ఫీల్ అయినట్టు చెప్పుకొచ్చాడు. ఐతే స్టార్ సినిమా ఏదైనా సరే ఫలితాన్ని ముందే గెస్ చేయడం చాలా కష్టం.

సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది ఎవరి చేతుల్లో ఉండదు. ఆడియన్స్ కు నచ్చితే ఎంత చిన్న సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవుతుంది. వారికి నచ్చని ఎన్ని వందల కోట్ల సినిమా అయినా ఫ్లాప్ అవుతుంది. ఆ విషయాన్ని గుర్తించిన స్టార్స్ ఈమధ్య ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చే సినిమాలనే చేస్తున్నారు. అంతే కాదు పాన్ ఇండియా లెవెల్ లో తమ సత్తా చాటుతున్నారు. జంజీర్ టార్గెట్ మిస్సైనా RRR తో హిందీలో అదరగొట్టాడు రాం చరణ్. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా నేషనల్ లెవెల్ లో భారీ రిలీజ్ అవుతుంది.


Full View


Tags:    

Similar News