అంబానీ పెళ్లికి ఆహ్వానం అందడమే గొప్ప
ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక స్టార్ గా రామ్ చరణ్ గొప్ప గౌరవాన్ని అందుకున్నారు. ఇలాంటి వేదికకు ఆహ్వానం అందడమే గొప్ప.
పేమెంట్ తీసుకున్న తర్వాతే పాప్ స్టార్ రిహన్నా అంబానీల ప్రీవెడ్డింగ్ వేడుకల్లో పెర్ఫామ్ చేసింది. దీనికోసం ఏకంగా 70కోట్లు పైగా అందుకుందని కథనాలొచ్చాయి. విమాన ప్రయాణాలకు టికెట్లు బస ఏర్పాట్లు వగైరా ఖర్చులు దీనికి అదనం. ఇంతకుముందు అంబానీల పెళ్లిలోనే డ్యాన్సులు చేసిన బియాన్స్ కూడా సుమారు 30 కోట్లు అందుకుందని ప్రచారమైంది. ముంబై నగరంలో ఖరీదైన పెళ్లిళ్లలో డ్యాన్సులు చేసి లేదా పాటలు పాడి సంపాదించుకునే సినీసెలబ్రిటీలకు కొదవేమీ లేదు. ధనికుల ఇండ్లలో ఏ వేడుక జరిగినా అది సెలబ్రిటీలకు సంపాదనా అవకాశం.
కింగ్ ఖాన్ షారూఖ్ కెరీర్ తొలి నాళ్లలో సెలబ్రిటీ వెడ్డింగ్స్ లో డ్యాన్సులు చేసి తన ప్రదర్శనకు డబ్బు అందుకునేవాడనేది తెలిసినదే. సల్మాన్, హృతిక్ రోషన్ లాంటి స్టార్లు సెలబ్రిటీ పెళ్లిళ్లలో డ్యాన్సుల కోసం భారీ మొత్తాలను అందుకున్నారు. చాలా మంది అగ్ర కథానాయికలు తమ ప్రదర్శనలతో ఈ తరహా ఆదాయం సంపాదించారు.
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ జంట ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేసిన SRK, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ డబ్బు తీసుకునే డ్యాన్సులు చేసారా? అంటే అలాంటిదేమీ లేదని సన్నిహిత సోర్స్ చెబుతోంది. ఈసారి అంబానీల పెళ్లిలో ఖాన్‌లు సైతం కేవలం సరదా వ్యాపకంగా డ్యాన్సులు చేసారు.. రిలేషన్ షిప్ కోసం చేసారు. అంబానీలను సంతోష పెట్టేందుకే ఇది చేసారు. ఖాన్ లు కెరీర్ ప్రారంభంలో అంతగా ఆదాయం లేని రోజుల్లో డబ్బు కోసం ఈవెంట్లలో డ్యాన్సులు చేసారు కానీ, ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితి వారికి లేదు. పరిశ్రమ అగ్ర కథానాయకులుగా వందల కోట్లు ఆర్జిస్తున్నారు. వారి స్థాయి చాలా పెద్దది. అలాగే ఇదే ఈవెంట్లో పాల్గొన్న చరణ్ కూడా ఖాన్ లతో కలిసి డ్యాన్సులు చేసారు. వేదికపైకి రావాలని 'రామ్ .. చరణ్' అంటూ ఖాన్ లు ఎంతో ఆప్యాయంగా పిలవగా అక్కడికి వెళ్లిన చరణ్ ఆర్.ఆర్.ఆర్ సాంగ్ 'నాటు నాటు' కోసం ఖాన్ లతో స్టెప్పు కలిపాడు. వారంతా అక్కడ సరదాగా కనిపించారు.
అయితే చరణ్ కోసం డబ్బు చెల్లించారా? అంటే అలాంటిదేమీ లేదని ఇన్ సైడ్ సోర్స్ చెబుతోంది. రిహాన్నా, ఇల్యూజనిస్ట్ డేవిడ్ బ్లెయిన్ లాంటి అంతర్జాతీయ స్టార్స్ కే డబ్బు అందింది తప్ప ఈ వేడుకల్లో లోకల్ స్టార్స్ ఎవరూ ఎలాంటి ప్యాకేజీలు అందుకోలేదని సోర్స్ చెబుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్, బిల్ గేట్స్, ఫేస్ బుక్ జుకర్ బర్గ్ వంటి గొప్ప ప్రముఖులు విచ్చేసిన ఇలాంటి గౌరవప్రదమైన ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక స్టార్ గా రామ్ చరణ్ గొప్ప గౌరవాన్ని అందుకున్నారు. ఇలాంటి వేదికకు ఆహ్వానం అందడమే గొప్ప. ఇలాంటి సమయంలో చరణ్ పై నెటిజనులు సాగిస్తున్న ప్రచారం సరికాదు...
ఇలాంటి సందర్భాల్లో సంపాదించుకోవాలనే తృష్ణతో ఎవరూ చేయరు. హై ప్రొఫైల్ వెడ్డింగ్ లో దాండియా ఆడటం.. గర్భాలో పాల్గొనడం వంటివాటికి డబ్బు చెల్లించరు. ఇవాంక ట్రంప్ .. జుకర్ బర్గ్ వైఫ్ కూడా సాంప్రదాయ దాండియా నేర్చుకుని అందరితో కలిసిపోయి అలరించారు. ఇలాంటి ప్రత్యేక ఈవెంట్ కోసం అంబానీ నుంచి పిలుపు అందడమే గొప్ప గౌరవంగా భావించాలి.