మ‌రో నాలుగేళ్ల‌లో ఇండ‌స్ట్రీకి మ‌రో వార‌సుడు!

టాలీవుడ్ లో మ‌ళ్లీ వార‌సులు ఊపందుకుంటున్నారు. త్వ‌ర‌లో న‌ట‌సింహ బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు.

Update: 2024-09-13 05:38 GMT

టాలీవుడ్ లో మ‌ళ్లీ వార‌సులు ఊపందుకుంటున్నారు. త్వ‌ర‌లో న‌ట‌సింహ బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో అత‌డి డెబ్యూ ఫిక్సైంది. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌యుడు అకీరానంద‌న్, మాస్ రాజా ర‌వితేజ త‌న‌యుడు మ‌హానందన్ కూడా రెండు, మూడేళ్ల‌లో తెరంగేట్రం చేసే అవ‌కాశం ఉంది. ఇంకా ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల త‌న‌యుల ఎంట్రీకి సంబంధించి బ్యాకెండ్ వ‌ర్క్ జ‌రుగుతుంది.

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో సుధీర్ బాబు వార‌సుడు చ‌రిత్ మాన‌స్ కూడా ఎంట్రీకి రెడీ అవుతున్న‌ట్లు తాజాగా సుధీర్ బాబు రివీల్ చేసాడు. మరో నాలుగేళ్ల‌లో చ‌రిత్ ఎంట్రీ ఉంటుంద‌ని సుధీర్ బాబు క‌న్ప‌మ్ చేసాడు. సినిమాలంటే త‌నెంతో ఫ్యాష‌న్ గా ఉన్నాడ‌ని, త‌మ కుటుంబ స‌భ్యులంతా ఇప్పుడే వ‌ద్దు..కొన్నాళ్లు ఆగ‌మ‌న్నా చ‌రిత్ ఆగేలా లేడ‌ని సుధీర్ బాబు తెలిపాడు. దీంతో చ‌రిత్ ఎంట్రీ కూడా క‌న్ప‌మ్ అయిన‌ట్లే.

ఇప్ప‌టికే చ‌రిత్ మానస్ యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. స్టంట్స్ కి సంబంధించి చిన్న నాటి నుంచి ర‌క‌ర‌కాల ట్రైనింగ్ లు తీసుకుంటున్నాడు. కుంగ్ పూ..క‌రాటా లాంటి విలు విద్య‌ల్లో ఆరితేరుతున్నాడు. వాటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక చ‌రిత్ పోలిక‌లు అచ్చంగా మేన మేమ మ‌హేష్ ని పోలిన సంగ‌తి తెలిసిందే.

ఆ మ‌ధ్య ఓ వీడియోలో మ‌హేష్ నే త‌ల‌పించాడు. సుదీర్ బాబు కొడుకైనా కొన్ని ఎక్స్ ప్రెష‌న్స్ మ‌హేలా ఉన్నాయ‌ని నెటి జ‌నులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఆ వీడియోకి సోష‌ల్ మీడియాలో మంచి లైక్ లు..షేర్లు ద‌క్కాయి. ఈ మ‌ధ్య కాలంలో చ‌రిత్ మాన‌స్ సినిమా ఈవెంట్ల‌కు కూడా అప్పుడ‌ప్పుడు హాజ‌ర‌వుతున్నాడు. జ‌నాల‌కు తాను ఎవ‌రో తెలియాల‌నే ఇలా ముందుగానే ప్రిపేర్ అవుతున్నాడు.

Tags:    

Similar News