దక్షిణాదిన సింగిల్ స్క్రీన్లకు చెక్.. PVR పద్మవ్యూహం!
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ బిజినెస్ ఊపందుకుంది. ప్రముఖ ప్రాపర్టీ డెవలపింగ్ దిగ్గజాలు స్టార్ హీరోలను కలుపుకుని, భారీ మల్టీప్లెక్స్ నిర్మాణాలను చేపడుతున్నాయి.
లాభాలు దండీగా ఉంటేనే వ్యాపారం చేయడం కార్పొరెట్ స్టైల్. బిజినెస్ సరిగా లేకపోతే మూత వేయడానికి వెనకాడరు. ఇప్పుడు ప్రముఖ మల్టీప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్ 2025 ఆర్థిక సంవత్సరం(FY25)లో దాదాపు 70 నాన్-పెర్ఫార్మింగ్ స్క్రీన్‌లను మూసివేయడానికి సిద్ధంగా ఉంది. ఆసక్తికరంగా సౌత్ లో స్క్రీన్లను పెంచేందుకు వ్యూహం రచిస్తూనే.. ముంబై, పూణే, వడోదర వంటి ప్రదేశాలలో నాన్-కోర్ రియల్ ఎస్టేట్ ఆస్తులలో కలిసి రాని వాటిని తగ్గించాలని చూస్తోంది. దీనిని సంభావ్య మానిటైజేషన్ కోసం ప్రయత్నం అని చెబుతున్నారు.
కంపెనీ వార్షిక నివేదిక ఫైలింగ్ ప్రకారం.. లాభదాయకమైన వృద్ధిని సాధించడానికి కంపెనీ 60-70 పని చేయని స్క్రీన్‌లను మూసివేస్తోంది..అయితే ఇదే ఆర్థిక సంవత్సరం (FY25)లో 120 స్క్రీన్‌లను అదనంగా జోడిస్తుంది. అంటే లాభదాయకమైన ప్రదేశాలను ఎంచుకుని అక్కడ కొత్త స్క్రీన్లను పెంచుతుంది. ఆసక్తికరంగా తక్కువ చొచ్చుకుపోయే ప్రాంతాలలోకి ప్రవేశించడానికి కంపెనీ మధ్యస్థ -దీర్ఘకాలిక వ్యూహం అనుసరిస్తుంది. 40 శాతం కొత్త స్క్రీన్‌లు దక్షిణ భారతదేశం నుండి వస్తాయని పీవీఆర్ నివేదికను రూపొందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త స్క్రీన్ జోడింపులపై దాని పెట్టుబడుల విధానాన్ని 25 శాతం నుండి 30 శాతం వరకు తగ్గించడానికి క్యాపిటల్-లైట్ గ్రోత్ మోడల్ వైపు మారాలని చూస్తోంది.
భవిష్యత్తులో నికర-రుణ రహిత కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నందున ఇది యాజమాన్యంలోని స్థిరాస్తి ఆస్తుల మోనటైజేషన్‌ను కూడా అంచనా వేస్తోంది. PVR ఇప్పుడు ఫ్రాంచైజ్-యాజమాన్యం .. కంపెనీ-ఆపరేటెడ్ (FOCO) మోడల్‌కు మారడం ద్వారా కొత్త స్క్రీన్ కాపెక్స్‌లో సంయుక్తంగా పెట్టుబడి పెట్టడానికి డెవలపర్‌లతో భాగస్వామి అవుతుంది. ఇది తక్కువ ప్రాతినిధ్యం లేని మార్కెట్లను విస్తరించేందుకు దాని విస్తరణను వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తోంది. ముంబై, పూణె, వడోదర వంటి ప్రధాన ప్రదేశాలలో ఉన్న మా నాన్-కోర్ రియల్ ఎస్టేట్ ఆస్తుల ద్వారా ఇది సంభావ్య మానిటైజేషన్‌ను కలిగి ఉంటుందని మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ కుమార్ బిజిలీ - ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ కంపెనీ వాటాదారులను ఉద్దేశించి అన్నారు.
ప్రస్తుత సంవత్సరంలో PVR INOX మొత్తం 25 సినిమా ప్రాపర్టీల్లో 130 కొత్త స్క్రీన్‌లను తెరిచింది. లాభదాయకమైన వృద్ధి వ్యూహానికి అనుగుణంగాతక్కువ పనితీరు కనబరిచిన స్క్రీన్లను పరిశీలిస్తోంది. FY24లో PVR ఐనాక్స్ నికర రుణం రూ. 1,294 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర రుణాన్ని రూ. 136.4 కోట్ల మేర తగ్గించుకున్నట్లు సిఎఫ్‌ఓ గౌరవ్ శర్మ తెలిపారు.
సింగిల్ స్క్రీన్ల వ్యాపారం పతన దశ:
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ బిజినెస్ ఊపందుకుంది. ప్రముఖ ప్రాపర్టీ డెవలపింగ్ దిగ్గజాలు స్టార్ హీరోలను కలుపుకుని, భారీ మల్టీప్లెక్స్ నిర్మాణాలను చేపడుతున్నాయి. వీటిలో సినిమా కాంప్లెక్స్ లను ఏర్పాటు చేసి అద్భుతమైన లాభాలను ఆర్జిస్తున్నాయి. మహేష్, ప్రభాస్, బన్ని, దేవరకొండ వంటి స్టార్లు ఈ రంగంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.
అయితే మల్టీప్లెక్సుల దూకుడు ముందు సింగిల్ స్క్రీన్లు వెలవెలబోతున్నాయి. దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. అన్నిచోట్లా సింగిల్ స్క్రీన్లు మూత పడుతున్నాయి. లేదా వాటి స్థానంలో మల్టీప్లెక్సులను నిర్మిస్తున్నారు. విస్త్రతమైన మల్టీప్లెక్స్ కల్చర్ పెరగడంతో సింగిల్ స్క్రీన్లు కనుమరుగవుతున్నాయి. తాజా సమాచారం మేరకు దేశంలోని సింగిల్ స్క్రీన్ కౌంట్‌ను అధిగమించడానికి మల్టీప్లెక్స్‌లకు ఎంతో సమయం పట్టదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది సాధ్యమయ్యే వీలుందని అంచనా. ఓవైపు పీవీఆర్ ఐనాక్స్ దూకుడుగా దక్షిణాదిన సింగిల్ స్క్రీన్లు పెంచే యోచనతో ఉండడంతో ఇది సాధ్యమేనని కూడా భావిస్తున్నారు.
2009లో భారతదేశంలో 925 మల్టీప్లెక్స్‌లు, 9710 సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి. ఏటా మల్టీప్లెక్స్‌ల సంఖ్య పెరుగుతుండగా సింగిల్ స్క్రీన్‌ల సంఖ్య తగ్గింది. ఈ సంవత్సరం నాటికి భారతదేశంలో మొత్తం 9,208 స్క్రీన్‌లు ఉన్నాయి. వాటిలో 4745 సింగిల్ స్క్రీన్‌లు, 4463 మల్టీప్లెక్స్‌లు ఉన్నట్టు లెక్క తేలింది. ఈ ఏడాది చివరి నాటికి మల్టీప్లెక్స్ కౌంట్ సింగిల్ స్క్రీన్ కౌంట్‌ను అధిగమించవచ్చని అంచనా. గత 14 సంవత్సరాలలో దాదాపు 5,000 సింగిల్ స్క్రీన్‌లు మూసివేసారని కూడా చెబుతున్నారు. 2023లో 660కి పైగా థియేటర్లు మూసివేసారని అంచనా. ప్రస్తుతం దేశంలోని సింగిల్ స్క్రీన్‌లలో 66 శాతం దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి. మునుముందు తెలుగు రాష్ట్రాల్లో పీవీఆర్ వంటి దిగ్గజం భారీగా మల్టీప్లెక్స్ స్క్రీన్లను పెంచే ఆలోచనతో ఉంది. ఇప్పటికే ఉన్న సింగిల్ స్క్రీన్ల యాజమాన్యాలతో పీవీఆర్ ఒప్పందాలు చేసుకున్నా ఆశ్చర్యం అక్కర్లేదు.