చిన్నా ఇది వింత లోకం

ఇక సినిమాకు సంబంధించిన ఒక మంచి సాంగ్ ను విడుదల చేశారు. చిన్నా ఇది వింత లోకం.. అనే ఈ లిరికల్ సాంగ్ ఎంతో అర్థవంతంగా ఉంది.

Update: 2024-08-22 06:53 GMT

నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "35-చిన్న కథ కాదు". ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. నివేదా ఇందులో ఒక మధ్యతరగతి కుటుంబ గృహిణి పాత్రలో కనిపిస్తోంది. నూతన దర్శకుడు నంద కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియదర్శి మరియు విశ్వదేవ్ రచ్చకొండ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


తిరుపతి పట్టణ నేపథ్యంగా ఈ చిత్ర కథ నడుస్తుంది. ఇది ఒక మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే సవాళ్లను, జీవితంలో వచ్చే భావోద్వేగపూరిత సంఘటనలను చక్కగా ఆవిష్కరిస్తుందని మేకర్స్ తెలిపారు. తన భర్త, ఇద్దరు పిల్లలతో జీవిస్తున్న గృహిణి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనే అంశాలను సినిమాలో హైలెట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ కథలో భర్తగా విశ్వదేవ్ కనిపించనున్నారు.

ఇక సినిమాకు సంబంధించిన ఒక మంచి సాంగ్ ను విడుదల చేశారు. చిన్నా ఇది వింత లోకం.. అనే ఈ లిరికల్ సాంగ్ ఎంతో అర్థవంతంగా ఉంది. ప్రతీ పిల్లాడి జీవితంలో ఉండే కన్ఫ్యూజన్ భావాలను కూడా పాటలో హైలెట్ అవుతున్నాయి. 'ప్రశ్నించకుంటే.. ఏమీ రాదంటుంది. ప్రశ్నించామంటే..చాల్లే పొమ్మంటుంది..' అనే లిరిక్స్ కూడా ఆలోచింపజేస్తున్నాయి. వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఈ పాటను విజయ్ ప్రకాష్ ఆలపించగా భరద్వాజ్ లిరిక్స్ అందించారు.

కథాంశం ప్రకారం పిల్లల చదువు, భర్తతో మధ్యతరగతి కుటుంబ సమస్యలు ఎలా వస్తాయన్నదే ప్రధాన అంశం. అయితే, ఆ సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి అన్నదే సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందట. టీజర్ ను బట్టి మొదటి భాగంలో కామెడీ ప్రధానంగా ఉన్నా, కథా ముగింపు దగ్గరకు రాగానే భావోద్వేగాలు పలు విధాలుగా మారిపోతాయని తెలుస్తోంది. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రుల మధ్య ఉత్పన్నమయ్యే సమస్యలు, కుటుంబంలోని ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తు ఆందోళనల నేపథ్యంలో కథ ముందుకు సాగుతుందట.

ఇక విశ్వదేవ్ పాత్ర రాయలసీమ యాసలో చాలా రియాలిస్టిక్ గా ఉంటుందట. ప్రియదర్శి స్కూల్ టీచర్ పాత్రలో కనిపించి మంచి కామెడీ అందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ మరియు వాల్తేర్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో రానా దగ్గుబాటి, శ్రీజన్ యరబోలు, సిద్దార్థ్ రల్లపల్లి నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. లిరికల్ సాంగ్ లో చూపిన విజువల్స్ను బట్టి చాలా బాగా తెరకెక్కించారని అర్ధమవుతుంది.

Full View


Tags:    

Similar News