జపాన్ కు చిరు.. మ్యాటర్ ఏంటంటే?

జపాన్ షెడ్యూల్ లో 10రోజుల పాటు చిరంజీవితో పాటు మెయిన్ క్యాస్టింగ్ పై కీలకమైన సీన్స్ షూట్ చేయనున్నారని, అవి మూవీలో మెయిన్ హైలెట్ గా నిలవనున్నాయని టాక్.

Update: 2024-11-13 04:51 GMT
జపాన్ కు చిరు.. మ్యాటర్ ఏంటంటే?
  • whatsapp icon

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. డెబ్యూ మూవీ బింబిసారతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో సోషల్ ఫాంటసీ జోనర్ లో రూపొందుతున్న విశ్వంభరలో సీనియర్ హీరోయిన్ త్రిష ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఆమెతోపాటు మరికొందరు హీరోయిన్స్ కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా.. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. వీఎఫ్ ఎక్స్ వర్క్స్ కు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అనేక హాలీవుడ్ మూవీస్ నుంచి కాపీ కొట్టారనే రివ్యూస్ వచ్చాయి. దీంతో మెగాస్టార్ చిరంజీవి రంగంలో దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కొందరి ప్రముఖుల సలహాలు తీసుకున్నట్లు టాక్ వినిపించింది.

అయితే సంక్రాంతి కానుకగా విశ్వంభర సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ అనేక నెలల క్రితం ప్రకటించారు. కానీ రీసెంట్ గా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం పోస్ట్ పోన్ చేసినట్లు చెప్పారు. అదే సమయంలో మూవీ షూటింగ్ పెండింగ్ ఉండడం వల్లనే విశ్వంభరను మేకర్స్ వాయిదా వేసినట్లు ఉన్నారని, గేమ్ ఛేంజర్ కోసం కాదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

ఏదేమైనా షూటింగ్ పెండింగ్ ఉండడం మాత్రం నిజమే. అందులో భాగంగా విశ్వంభర మేకర్స్ ఇప్పుడు కొత్త షెడ్యూల్ జపాన్ లో ప్లాన్ చేస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు చిరంజీవి.. నేడు జపాన్ కు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. జపాన్ షెడ్యూల్ లో 10రోజుల పాటు చిరంజీవితో పాటు మెయిన్ క్యాస్టింగ్ పై కీలకమైన సీన్స్ షూట్ చేయనున్నారని, అవి మూవీలో మెయిన్ హైలెట్ గా నిలవనున్నాయని టాక్.

అదే సమయంలో ఓవైపు షూటింగ్.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను మేకర్స్ జరుపుతున్నట్లు ఇండస్ట్రీలో వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అన్ని పనులు త్వరగా పూర్తి చేసి త్వరలో ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ముందుగా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారని సమాచారం. సమ్మర్ కానుకగా మే9వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారని మేకర్స్ ఇప్పటికే ఫిక్స్ అయినట్లు వినికిడి.

ఇక సినిమా విషయానికొస్తే.. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై వంశీ కృష్ణ, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. అంజి తర్వాత మరోసారి చిరు.. సోషియో ఫాంటసీ మూవీ చేస్తుండడంతో ఎంతో ఈగర్ గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి వశిష్ట.. చిరుకు విశ్వంభరతో ఎలాంటి హిట్ అందిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News