టీజర్ టాక్: 'విశ్వంభర' మహా యుద్ధం మొదలైంది

టీజర్ లాస్ట్ షాట్ లో హనుమాన్ విగ్రహం ముందు మెగాస్టార్ ఒక పవర్ఫుల్ గధను పట్టుకొని ఇచ్చిన స్టిల్ కూడా అద్భుతంగా ఉంది.

Update: 2024-10-12 05:45 GMT

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే పోస్టర్స్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు మంచి కథ ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని మేకర్స్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.

ఇక టీజర్ కోసం ఫాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఫైనల్ గా దసరా పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకమైన ఒక టీజర్ లో విడుదల చేశారు. విశ్వం యొక్క ఆధ్యాత్మిక రహస్యం.. అంటూ మొదలైన టీజర్ లో సరికొత్త ప్రపంచాన్ని చూపించారు. అందులో డైనోసార్ లాంటి జంతువులు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

చూస్తుంటే సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఇక దుష్టశక్తి కూడా ఆ క్రమంలో తన ఆధిపత్యాన్ని చూపిస్తుంది అని హైలెట్ చేశారు. విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రానా వెలుగు రాదని కాదు, ప్రశ్నలు పుట్టించిన కాలమే.. సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది. విర్రవీగుగుతున్న ఈ ఆరాచకానికి.. ముగింపు పలికే మహా యుద్ధాన్ని తీసుకు వస్తుంది.. అనే డైలాగ్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది.

ఇక ఆ క్రమంలో రెక్కల గుఱ్ఱంపై వచ్చిన మెగా వీరుడు దుష్ట శక్తులపై చేసే యుద్ధం మేజర్ హైలెట్ గా నిల్వనున్నట్లు చూపించారు. సినిమాలో గ్రాండ్ యాక్షన్ విజువల్స్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండనున్నట్లు అర్ధమవుతుంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా కథానాయకుడిగా చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. టీజర్ లాస్ట్ షాట్ లో హనుమాన్ విగ్రహం ముందు మెగాస్టార్ ఒక పవర్ఫుల్ గధను పట్టుకొని ఇచ్చిన స్టిల్ కూడా అద్భుతంగా ఉంది. ఇక కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మరీంత ఆసక్తిని పెంచింది.

విశ్వంభర సినిమాలో విజువల్స్ మాత్రం నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండనున్నట్లు టీజర్ తో ఫైనల్ గా మరో క్లారిటీ ఇచ్చేశారు. అసలైతే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ గేమ్ ఛేంజర్ అదే సమయానికి వస్తుండడంతో యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేంజ్ చేసింది. సమ్మర్ కు ఈ సినిమా రావచ్చని టాక్. త్వరలోనే విడుదల డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు.

Full View
Tags:    

Similar News