చిరంజీవి ఇష్టం లేకుండానే చేశారా..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా రూపొందిన భోళా శంకర్ సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది

Update: 2023-08-08 04:19 GMT

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా రూపొందిన భోళా శంకర్ సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ ని గెటప్ శ్రీను తనదైన శైలిలో ఎంటర్‌ టైన్‌మెంట్‌ గా మార్చేశాడు. జబర్దస్త్‌ కమెడియన్స్ పలువురు కూడా పాల్గొనడంతో ఆ ఇంటర్వ్యూ మొత్తం కూడా సందడిగా మారింది. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్న నేపథ్యం లో మంచి బజ్ క్రియేట్‌ అయింది... దాంతో భారీ ఓపెనింగ్స్‌ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక చిరంజీవి తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ సినిమా ను చేసేందుకు తాను మొదట ఆసక్తి చూపించలేదు అన్నారు. మలయాళం మూవీ లూసీఫర్ ను రీమేక్‌ చేస్తున్న సమయంలో ఈ రీమేక్ ను నా వద్దకు తీసుకు వచ్చారు. లూసిఫర్ చేస్తున్న ఈ సమయంలోనే వేదాళం రీమేక్ చేయడం సరి కాదేమో అనుకున్నారట.

వరుసగా రీమేక్ లు చేయడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో అనే ఉద్దేశ్యంతో చిరంజీవి 'వేదాళం' రీమేక్‌ పై మొదట ఆసక్తి చూపించలేదట. కానీ దర్శక నిర్మాతలు వేదాళం కథ వినిపించడం తో పాటు సినిమా ఎక్కడ కూడా ఓటీటీ ల్లో లేదు.. అంతే కాకుండా లూసీఫర్‌ స్థాయిలో వేదాళం గురించి మీడియాలో ప్రచారం జరగలేదు.

తమిళ్ లో డీసెంట్‌ హిట్ గా నిలిచింది కానీ ఎక్కువ శాతం మంది ఈ సినిమా గురించి మాట్లాడుకోలేదు. ముఖ్యంగా బయట రాష్ట్రాల్లో వేదాళం గురించి ఎక్కువ చర్చ జరగలేదు కనుక ఇది ఒక ఫ్రెష్ మూవీ అన్నట్లుగా ఉంటుందని.. రీమేక్ అన్నట్లుగా కాకుండా స్టోరీ లైన్ తీసుకుని మొత్తం మార్చేద్దాం అంటూ మెహర్‌ రమేష్ హామీ ఇవ్వడం వల్ల చిరు అయిష్టంగా ఒప్పుకున్నారు అనేది టాక్‌.

చిరు అయిష్టంగా ఒప్పుకున్నా.. ఒక సారి కమిట్ అయితే అన్నట్లుగా చిరు ప్రాణం పెట్టి సినిమాలో నటించారు. చాలా విభిన్నమైన లుక్‌ లో.. కష్టమైన సన్నివేశాల్లో చిరంజీవి నటించారని టాక్‌. వాల్తేరు వీరయ్య రేంజ్ విజయాన్ని చిరుకు భోళా శంకర్ కట్టబెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఒక పక్కా కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఈ సినిమాను మెహర్‌ రమేష్‌ రూపొందించినట్లుగా తెలుస్తోంది. రీమేక్ మాస్టర్ గా పేరున్న మెహర్‌ తప్పకుండా ఈ సినిమా తో 'షాడో' నుండి బయటకు రావడం ఖాయం అనిపిస్తుంది.

Tags:    

Similar News