.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

నాగ్ అశ్విన్ - మెగాస్టార్.. ఇంత రచ్చ ఎందుకు?

అలాగే కొన్ని విషయాలలో హీరోలకి ఎలాంటి ఇబ్బంది లేకపోయిన ఫ్యాన్స్ హడావిడి మాత్రం పీక్ లో ఉంటుంది.

Update: 2024-06-30 09:05 GMT

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఫ్యాన్స్ హంగామా ఎక్కువ అయిపొయింది. ఒకప్పుడు తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయ్యే సమయంలో థియేటర్స్ దగ్గర గొడవపడే ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చేశారు. తమ అభిమాన హీరో సినిమా వచ్చినపుడు తెగ హంగామా చేస్తారు. సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చిందని ఎవరైనా కామెంట్స్ చేస్తే వారి మీద ఎదురుదాడి చేస్తారు. అలాగే కొన్ని విషయాలలో హీరోలకి ఎలాంటి ఇబ్బంది లేకపోయిన ఫ్యాన్స్ హడావిడి మాత్రం పీక్ లో ఉంటుంది.

తాజాగా కల్కి 2898ఏడీ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో సెలబ్రెటీలు అందరూ ట్విట్టర్ లో రియాక్ట్ అవుతూ చిత్ర యూనిట్ ని అభినందిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి కల్కి విజయం పట్ల టీమ్ కి అభినందనలు తెలియజేశారు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ ట్వీట్ కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ వెంటనే రియాక్ట్ అయ్యారు. సర్ మీ ఆశీర్వాదాల పట్ల చాలాసంతోషంగా ఉంది. అస్సలు ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేకపోతున్న అని ట్వీట్ చేశారు.

Read more!

ఇది కాస్తా వైరల్ అయ్యింది. అయితే నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ కి వెంటనే రిప్లయ్ ఇవ్వలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ రంగంలోకి దిగి నాగ్ అశ్విన్ ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. మహానటి రిలీజ్ తర్వాత చిరంజీవి టీమ్ అందరికి ఇంటికి పిలిచి అభినందించారు. కానీ మీరు ఆయన అభినందిస్తే కనీసం థాంక్స్ చెప్పలేకపోయారా అంటూ కామెంట్స్ చేశారు. అయితే కల్కి 2898ఏడీ సినిమాలో అశ్వద్ధామ పాత్ర కోసం చిరంజీవిని సంప్రదిస్తే రిజక్ట్ చేశారని, దీంతో నాగ్ అశ్విన్ అప్సెట్ అయ్యారంటూ ఓ కథనాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

డార్లింగ్ అభిమానులు కూడా ట్విట్టర్ లో కామెంట్స్ వార్ చేసుకున్నారు. అయితే ఫ్యాన్స్ హంగామా తర్వాత నాగ్ అశ్విన్ మ్యాటర్ సీరియస్ లైన్ లోకి వెళ్తుందని గ్రహించి చిరంజీవి ట్వీట్ కి రిప్లయ్ ఇచ్చారు. ట్వీట్ లో కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా మీరు సినిమా చూడాలని కోరుకుంటున్నాను అని నాగ్ అశ్విన్ పోస్ట్ పెట్టారు. దీంతో మెగా ఫ్యాన్స్ కాస్తా కూల్ అయ్యారు.

అయితే మరికొందరు మాత్రం ఫ్యాన్స్ అంత రచ్చ చేయాల్సిన అవసరం లేదని, నాగ్ అశ్విన్ ది అసలు నిర్లక్ష్యం చేసే మనస్తత్వం కాదని అంటున్నారు. ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉందనే చర్చ తెరపైకి వచ్చింది. సుకుమార్ మూవీ కంప్లీట్ అయ్యాక నాగ్ అశ్విన్ తో రామ్ చరణ్ గ్లోబల్ లెవల్ సినిమాని చేయాలని అనుకుంటున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News