వెంకటేష్ హీరో అవుతాడని తెలిసి భయపడ్డా!
రామానాయుడికి రెండో అబ్బాయి కూడా ఉన్నాడని అప్పుడే తెలిసింది. ఎలా ఉంటాడు అని అడిగితే పర్వాలేదు అని చెప్పారు. కానీ కొన్నాళ్ల తర్వాత అందంగా మెరిసిపోతున్న వెంకటేష్ ని చూసాను.
వెంకటేష్..నాగార్జునల కంటే ముందుగానే మెగాస్టార్ చిరంజీవి తెరంగేట్రం జరిగిన సంగతి తెలిసిందే. అయితే నటసింహ బాలకృష్ణ కంటే చిరంజీవి జూనియర్ అనే చెప్పాలి. ఎందుకంటే బాలయ్య..చిరంజీవి కంటే ముందుగానే తెరంగేట్రం చేసారు. 1974 లో 'తాతమ్మ కల'తో బాలయ్య ఎంట్రీ ఇస్తే..1978 లో 'ప్రాణం ఖరీదు' చిత్రంతో చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. ఆ రకంగా ఇద్దరి మధ్య నాలుగేళ్ల వ్యత్యాసం ఉంది.
ఇక ఆ తర్వాత ఆ నలుగురు హీరోలు ఎదిగిన వైనం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎవరికి వారు స్టార్ డమ్ క్రియేట్ చేసుకుని ముందకెళ్తున్నారు. అయితే మూవీ మొఘల్ రామానాయుడు కి చిన్న కుమారుడు ఉన్నాడు అన్న సంగతి చిరంజీవికి చాలా కాలం పాటు తెలియదట. ఈ విషయాన్ని తాజాగా రివీల్ చేసారు. '1983 లో సురేష్ ప్రొడక్షన్స్ లో 'సంఘర్షణ' అనే సినిమా చేసాను. అప్పుడే నిర్మాణ రంగంలో శిక్షణ పొందుతున్న సురేష్ బాబు పరిచయం అయ్యారు.
రామానాయుడికి రెండో అబ్బాయి కూడా ఉన్నాడని అప్పుడే తెలిసింది. ఎలా ఉంటాడు అని అడిగితే పర్వాలేదు అని చెప్పారు. కానీ కొన్నాళ్ల తర్వాత అందంగా మెరిసిపోతున్న వెంకటేష్ ని చూసాను. అప్పుడు నాలో గుబులు మొదలైంది. రామానాయుడు సంస్థలో సినిమా చేయడం నాలాంటి వాళ్లకి అప్పట్లో ఓ భరోసా...ధీమా లాంటింది. వాళ్ల అబ్బాయి హీరో అయితే నాకు గట్టిపోటీ ఎదురవుతుందని భయపడ్డాను.
కానీ తనకు సినిమాలపై ఆసక్తి లేదు రాజా అని రామానాయుడు చెప్పాక ఊపరి పీల్చుకున్నాను. మళ్లీ రెండేళ్లకు వెంకటేష్ తిరిగొచ్చాడు. హీరోగా పరిచమయ్యాడు. అప్పటి నుంచి మంచి మిత్రులుగా ఒకరి మంచిని మరోకరు కోరుకుంటూ ప్రయాణం చేస్తున్నాం. కథల ఎంపికలో ఒక సినిమాకి మరో సినిమాకి సంబధం లేకుండా కొత్త కథలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఆయన నటించిన మల్లీశ్వరి సినిమా అంటే ఎంతో ఇష్టం. అన్ని రకాల సినిమాలు చేయడం తన ప్రత్యేకత. ఆయన ప్రయాణం ఇలాగే సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.