ప్రయోగాల హీరో.. ఇంకా ఎన్నాళ్ళు ఇలా?

పాన్ ఇండియా రేంజ్ లో రాబోయే ఈ మూవీ విక్రమ్ కి మంచి మార్కెట్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.

Update: 2024-02-19 04:12 GMT

చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ తంగలాన్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో భారీ బడ్జెట్ తో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీగా ఈ చిత్రాన్ని పా రంజిత్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మూవీలో విక్రమ్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సినిమా మొత్తం అతని క్యారెక్టర్ కి ఎలాంటి డైలాగ్స్ ఉండవంట. అలాగే అతని ఆహార్యం ఆదిమ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన వాడిగా ఉంది.

ఈ లుక్స్ అయితే చియాన్ విక్రమ్ అభిమానులకి కనెక్ట్ అయ్యింది. విభిన్నమైన క్యారెక్టర్స్ చేయడం విక్రమ్ అలవాటు. అతని కెరియర్ లో కచ్చితంగా తంగలాన్ ఓ మంచి సినిమా అవుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాది జనవరి 26న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ డేట్ నుంచి ఏప్రిల్ కి వాయిదా పడింది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సినిమాపై కూడా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. కోలార్ గోల్డ్ మైనింగ్స్ లో రియల్ గా జరిగిన సంఘటనల స్ఫూర్తితో పా రంజిత్ తంగలాన్ స్టోరీ చెబుతున్నాడు.

దీంతో సినిమాపైన హైప్ క్రియేట్ అయ్యింది. కచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రాబోయే ఈ మూవీ విక్రమ్ కి మంచి మార్కెట్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. కానీ ఏప్రిల్ లో కూడా ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం లేదంట. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత తంగలాన్ రిలీజ్ ఉంటుందని నిర్మాత కన్ఫర్మ్ చేశారు.

దీంతో వేసవి రేసు నుంచి రెండు, మూడు నెలలు తంగలాన్ వెనక్కి వెళ్ళినట్లే కనిపిస్తోంది. అయితే ఈ ఆలస్యం ఎందుకనేది తెలియని విషయంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పెర్ఫెక్షన్ కోసమే ఆలస్యం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తంగలాన్ ఏప్రిల్ రేసు నుంచి తప్పుకుంటే ఆ డేట్స్ ని కోలీవుడ్ వేరే సినిమా ఏమైనా ఉపయోగించుకుంటుందా అనేది చూడాలి. ఇక ఈ మూవీని నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి.

పా రంజిత్ కూడా చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీ చేస్తోన్నారు. కబాలి, కాలా తరహాలో కాకుండా పీరియాడిక్ జోనర్ లోకి వెళ్లి నిజజీవిత సంఘటనల స్ఫూర్తితో చరిత్ర ఆధారంగా ఈ కథని చెబుతున్నారు. పా రంజిత్ కథలలో ఎక్కువగా బలహీన వర్గాల పోరాటం కనిపిస్తోంది. ఇందులో కూడా అలాగే అంతరించిపోయిన తంగలాన్ అనే ఆటవిక తెగకి చెందిన కథని చూపించబోతున్నాడు.

Tags:    

Similar News