ఇండియాలో వాళ్లిద్దరితో పనిచేస్తానంటోన్న హాలీవుడ్ మేకర్!
తాజాగా భారత్ లో ఓ ఇద్దరు హీరోలతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ మరో హాలీవుడ్ డైరెక్టర్ చక్ రస్సెల్ ప్రకటించారు.
ఇండియన్ సినిమా విషయంలో ఇప్పటికే సరిహద్దులు చెరిగిపోయాయి. సౌత్ సినిమాల సక్సెస్ అన్నదే ఈ హద్దును చెరిపిందన్నది వాస్తవం. పాన్ ఇండియాలో తెలుగు సినిమాల సక్సస్ తో అన్ని భాషల హీరోలు టాలీవుడ్ కి దిగొచ్చా రు. భారత్ లో తెలుగు సినిమా స్థాయికి చేరిందనడానికి ఇదొక్కటి చాలదా? భాషల మద్య హద్దు చెరిగి పోయిందనడానికి. `ఆర్ ఆర్ ఆర్` తర్వాత రామ్ చరణ్..ఎన్టీఆర్ లతో హాలీవుడ్ మేకర్లు సైతం పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మనోళ్లు హాలీవుడ్ కి వెళ్లాలే గానీ సినిమాలు చేయడానికి అక్కడి వాళ్లంతా సిద్దంగా ఉన్నారు. ప్రపంచ దిగ్దదర్శకుడు జేమ్స్ కామోరూన్ సైతం తెలుగు సినిమాని ఏ స్తాయిలో కీర్తించారో తెలిసిందే. ఇది చాలదా తెలుగు సినిమా ఇండియ న్ నెంబర్ వన్ ఇండస్ట్రీ అనడానికి! ఇక బాలీవుడ్ నుంచి ఖాన్ లు, కపూర్ లు అంతా తెలుగు మేకర్లతో ఛాన్స్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. తాజాగా భారత్ లో ఓ ఇద్దరు హీరోలతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ మరో హాలీవుడ్ డైరెక్టర్ చక్ రస్సెల్ ప్రకటించారు.
గోవాలో జరుగుతోన్న ఇఫీ ఉత్సవాల్లో భాగంగా రస్సెల్ ఈ వ్యాఖ్యలు చేసారు. ఇంతకీ ఎవరా ఇద్దరు హీరోలంటే ఒకరు అమీర్ ఖాన్ కాగా, మరొకరు షారుక్ ఖాన్. ఓసారి ఆయన మాటల్లోకి వెళ్తే...`ఇటీవల కాలంలో నాకు బాగా నచ్చిన తెలుగు సినిమా `ఆర్ ఆర్ ఆర్`. ఇప్పుడు బాలీవుడ్ హీరోలు అమీర్, షారుక్ లతో పనిచేయాలను కుంటున్నాను. ఎందుకంటే వారితో పనిచేస్తే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోగల్గుతాను.
గతంలో హారర్, కామెడీ చిత్రాలు తెరపై చూసి ఆనందించేవాళ్లం. కానీ ఇప్పుడు హారర్ చిత్రాలకే ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంది. ప్రస్తుత కాలంలో ఎన్నో ఘటనలు పేపర్లలో చూస్తున్నాం. వాటిలో ఏది నమ్మాలో అర్దం కాని పరిస్థితి. వీటి చుట్టూ మంచి కథ అల్లడానికి ఆస్కారం ఉంది` అని అన్నారు.