అందితే జుట్టు...అంద‌క‌పోతే కాళ్లు!

లైగర్‌లో నటించినందుకు అనన్య పాండేకి బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు సైతం మిస్‌ అయ్యాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

Update: 2025-02-06 13:30 GMT

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన 'లైగర్‌' సినిమా తీవ్రంగా నిరాశ పరచింది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన లైగర్‌ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ ప్రాజెక్ట్‌ల్లో ఒకటిగా మిగిలి పోయింది. పూరి జగన్నాధ్‌ గత చిత్రాలు ఇడియట్‌, పోరికి రేంజ్‌లో హిట్‌ అవుతుందని భావించిన లైగర్ సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహంకు గురి అయ్యారు. ఆ సినిమా వల్ల పూరి జగన్నాధ్‌ కెరీర్ మరింతగా ఇబ్బందుల్లో పడ్డట్లు అయ్యింది. లైగర్‌లో నటించినందుకు అనన్య పాండేకి బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు సైతం మిస్‌ అయ్యాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో అనన్య పాండే మాట్లాడుతూ.. లైగర్ సినిమాను తన తండ్రి చంకీ పాండే చెప్పడం వల్ల చేశాను అంది. సినిమా విషయంలో స్పష్టత లేకపోవడంతో చేయకుండా ఉండటం మంచిదని తాను భావించాను. కానీ పెద్ద దర్శకుడు, పెద్ద హీరో కావడంతో హిట్‌ అయితే మంచి ఫ్యూచర్ ఉంటుందని భావించి నాన్న ఒప్పించారని ఆ ఇంటర్వ్యూలో అనన్య పాండే చెప్పుకొచ్చింది. అదే విషయాన్ని గురించి తాజాగా చంకీ పాండే స్పందించారు. లైగర్‌ ఫలితం చాలా నిరుత్సాహానికి గురి చేసిందని, ఆ సినిమాపై నమ్మకంతో నటించమని తన కూతురుకు చెప్పానని ఆయన అన్నారు.

చంకీ పాండే మాట్లాడుతూ... లైగర్‌ సినిమా ఆఫర్‌ వచ్చిన సమయంలో అనన్యకు ఆసక్తి లేదు. సినిమా కథలో తాను చాలా చిన్న పిల్ల మాదిరిగా కనిపిస్తానేమో అని అనుమానించింది. అందుకే నా వద్దకు వచ్చి అడిగింది. ఆ సమయంలో నేను ఆమెకు నచ్చ చెప్పి చేసేందుకు ఒప్పించాను. ఇది ఒక బిగ్‌ ప్రాజెక్ట్‌ కనుక తప్పకుండా చేయమని నేను చెప్పాను. ఆ ప్రాజెక్ట్ సక్సెస్‌ అయితే తప్పకుండా మంచి పేరు వస్తుందని నేను భావించాను. అదే విషయాన్ని ఆమెతో చెప్పిన సమయంలో ఒప్పుకుంది. తీరా చూస్తే ఏదైతే అనన్య ఊహించిందో అదే జరిగింది. సినిమాలో ఆమె లుక్ విషయంలో, పాత్ర విషయంలో విమర్శలు వచ్చాయని చంకీ పాండే అన్నారు.

లైగర్‌ సినిమాను ఒప్పుకోమని నేను చెప్పడం అనేది పెద్ద తప్పుడు నిర్ణయం. ఆ సినిమాలో అనన్య నటించకుండా ఉండాల్సిందని చంకీ పాండే అన్నారు. అయితే కెరీర్‌లో అన్ని సక్సెస్‌లు దక్కవని, కొన్ని సార్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్లాప్‌లు పడుతూ ఉంటాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తప్పకుండా బాలీవుడ్‌లో అనన్య పాండేకి మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకంను చంకీ పాండే వ్యక్తం చేశారు. ముందు ముందు బాలీవుడ్‌లో ఆమె ఏ సినిమా ఒప్పుకోవాలన్నా తన నిర్ణయం మాత్రం ఉండదని, ఆమె పూర్తి స్వేచ్ఛతో, ఆసక్తితో ఎంపిక చేసుకోవాల్సిందే అని చంకీ పాండే అన్నారు.

లైగర్ ప్లాప్ అయిన త‌ర్వాత మా అమ్మాయే చెప్పింది క‌రెక్ట్ అని అంటున్నాడు. ఇద్ద‌రి ప‌ద్ద‌తి అందితే జుట్టు..అంద‌క‌పోతే కాళ్లు ప‌ట్టుకునే టైప్ లో మాట్లాడుతున్నారు. ముంబై భామ‌లు సౌత్ లో ఫెయిలైన చాలా మంది ఇదే త‌ర‌హాలో మాట్లాడారు. వాళ్లంద‌రికీ కౌంట‌ర్ వేద్దాం


Tags:    

Similar News