LCU పై క్లారిటీ షార్ట్ ఫిలిం ఇచ్చేస్తుందా?
ఏ కథని ఏ బ్యాక్ డ్రాప్ లో చెప్పబోతున్నాడు? వాటి ఇంటర్ లింక్ ఏంటి? అన్నది చెప్పడానికే షార్ట్ ఫిలింని ప్రకటించాడా? అంటే అవుననే తెలుస్తోంది.
ఎల్ సీ యూ నుంచి నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఖైదీ సీక్వెలా? విక్రమ్ సీక్వెలా? లియో కి కంటున్యూటీనా? లేక రోలెక్స్ నే హైలైట్ చేస్తూ మార్కెట్ లో కి వస్తాడా? ఇలా ఎన్నో రకాల సందేహాలు అభిమానుల్లో ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే ఎల్ యూ సీ నుంచి రిలీజ్ అయిన సినిమాలన్ని ఇంటర్లింక్ అని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఇన్ని రకలా కన్ప్యూజన్లు తెరపైకి వస్తున్నాయి.
మరి వీటన్నింటికీ లోకేష్ షార్ట్ ఫిలిం ద్వారా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏ కథని ఏ బ్యాక్ డ్రాప్ లో చెప్పబోతున్నాడు? వాటి ఇంటర్ లింక్ ఏంటి? అన్నది చెప్పడానికే షార్ట్ ఫిలింని ప్రకటించాడా? అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పటికే ' ఖైది'..'విక్రమ్'..'లియో' క్యారెక్టర్లను కనెక్ట్ చేస్తూ వాటి టైమ్ లైన్స్ డీకోడ్ చేసాడు లోకేష్. కానీ ఎంతవరకూ లిబర్టీ తీసుకుంటున్నాడు? అన్నది క్లారిటీ లేదు.
అందుకే 'ఖైదీ2' రిలీజ్ కి ముందు క్లియర్ పిక్చర్ ఇచ్చేందుకు లోకేష్ ప్లాన్ చేస్తున్నాడనిపిస్తోంది. 10 నిమిషాల నిడివితో ఎల్ సీయూ కనెక్షన్ రివీల్ చేస్తూ ఓ షార్ట్ ఫిలిం ప్లాన్ చేస్తున్నాడు. 'ఖైదీ' 2019 లో జరుగుతుంది. అంతకు ముందు పదేళ్ల పాటు ఢిల్లీ జైల్లో ఉన్నాడు. అంటే 2009 కి ముందు ఢిల్లీ జీవితంలో జరిగిన సంఘటనలే 'ఖైదీ-2' గా ఉండే ఛాన్స్ ఉంది. విక్రమ్ కథ కూడా ఖైదీకి సమాంతరంగా జరుగుతుం దని చూపించారు.
అంటే `విక్రమ్` స్టోరీ టైమ్ పిరియడ్ కూడా 2019 లోనే ఉంటుంది. క్లైమాక్స్ లో రోలెక్స్ ఎంట్రీ.. రోలోక్స్ కూడా ఢిల్లీ..విక్రమ్ పాత్రలకు సమాంతరంగా ఉండొచ్చని గెస్సింగ్స్ తెరపైకి వస్తున్నాయి. `లియో` మాత్రం 2021 లో జరుగుతుంది. కాబట్టి కాస్త అటు ఇటు గా అన్ని పాత్రలు ఒకేటైమ్ పీరియడ్ లో ఉంటుందన్నది అభిమానుల వెర్షన్. మరి ఈ గెస్సింగ్స్ పై లోకేష్ షార్ట్ ఫిలిం ద్వారా ఎలాంటి క్లారిటీ ఇస్తాడు? అన్నది చూడాలి. ప్రస్తుతం కనగరాజ్ తలైవార్ రజనీకాంత్ 171వ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.