క్లిక్‌ క్లిక్ : నిశ్చితార్థం తర్వాత ఓపెన్ అయిన మెగా జోడీ

తాజాగా కాఫీ డేట్‌ కి వెళ్లిన వరుణ్‌.. లావణ్య త్రిపాఠి

Update: 2023-07-19 04:21 GMT
క్లిక్‌ క్లిక్ : నిశ్చితార్థం తర్వాత ఓపెన్ అయిన మెగా జోడీ
  • whatsapp icon

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్ చూడ్డానికి చాలా సైలెంట్ గా.. తన పని తాను చేసుకుంటూ పోతాడు అన్నట్లుగా అనిపిస్తాడు. వరుణ్ తేజ్ గురించి ప్రేమ వార్తలు... పుకార్లు వచ్చిన సమయంలో చాలా మంది నమ్మలేదు. వరుణ్‌ బాబు అలా కాదని మెగా ఫ్యాన్స్ చాలా మంది గట్టిగా వాదించారు. కానీ అందాల రాక్షసి తో ప్రేమలో ఉన్నట్లు నిశ్చితార్థం తో క్లారిటీ ఇచ్చాడు.

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠితో సుదీర్ఘ కాలంగా ప్రేమలో కొనసాగుతున్న వరుణ్ తేజ్‌ ఇటీవల ఇరు కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్న విషయం తెల్సిందే. మెగా ఫ్యామిలీ సమక్షంలో అంగరంగ వైభవంగా లావణ్య త్రిపాఠితో వరుణ్‌ తేజ్ పెళ్లి నిశ్చితార్థ వేడుక జరిగింది. అంతకు ముందు వరకు ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా సోషల్‌ మీడియాలో తమ లవ్‌ పిక్స్‌ ను షేర్‌ చేసుకోలేదు.

నిశ్చితార్థం ఫోటోలను షేర్‌ చేసిన తర్వాత వీరిద్దరు మళ్లీ తమ క్యూట్‌ లవ్‌ పిక్స్ ను షేర్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియా లో ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా కాఫీ డేట్‌ కి వెళ్లిన వరుణ్‌.. లావణ్య త్రిపాఠిలు ఒకరి ఫోటోను మరొకరు సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేయడం తో ఆ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.

లావణ్య త్రిపాఠి ఫోటోను కాఫీ కప్పు చూపిస్తూ వరుణ్‌ తేజ్ షేర్‌ చేయగా... వరుణ్‌ తేజ్ ను కూడా అదే తరహా లో లావణ్య త్రిపాఠి షేర్‌ చేసింది. మొత్తానికి ఇద్దరూ కూడా క్రియేటివ్ గా తమ డేట్ కు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరో వైపు కొత్త సినిమాల కోసం కథలు వింటున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో వరుణ్‌ తేజ్ ఫిజిక్‌ పై కూడా చాలా శ్రద్ద పెట్టినట్లుగా ఆయన వర్కౌట్ వీడియోలను చూస్తే అర్థం అవుతుంది. ఇక లావణ్య త్రిపాఠి కూడా ఒకటి రెండు సినిమాల్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది. వాటి గురించి త్వరలో అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News