కమిటీ కుర్రాళ్ళు రిలీజ్ ట్రైలర్… పల్లెటూళ్ళో తిరుగుబాటు

ఆగష్టు 9న ఈ మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో విలేజ్ నేపథ్యంలో ఈ మూవీ కథని చెప్పబోతున్నారు.

Update: 2024-08-06 06:24 GMT

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకి మంచి ఆదరణ వస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రియలిస్టిక్ కథలతో తెరకెక్కిన సినిమాలకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు. మెగా డాటర్ నిహారిక కొణెదల తన పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై ఫస్ట్ సినిమాగా కమిటీ కుర్రాళ్ళు సినిమాని నిర్మించింది. ఆగష్టు 9న ఈ మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో విలేజ్ నేపథ్యంలో ఈ మూవీ కథని చెప్పబోతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే కమిటీ కుర్రాళ్ళు సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూవీ రిలీజ్ ట్రైలర్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది. మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సాయి కుమార్ ఈ చిత్రంలో గ్రామ సర్పంచ్ పాత్రలో కనిపిస్తున్నాడు. మిగిలిన క్యాస్టింగ్ అంతా కొత్తవాళ్లే ఉన్నారు.

వీరిలో కొంతమంది యుట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయిన ఆర్టిస్ట్స్ కూడా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే రిలీజ్ ట్రైలర్ చూస్తుంటే గ్రామంలో జరిగే ఉత్సవాలు ఆర్గనైజ్ చేసే కమిటీ కుర్రాళ్ళ చుట్టూ కథ నడుస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న వయస్సులో హ్యాపీగా అందరూ కలిసిమెలిసి తిరిగేవారు పెరిగి పెద్దయ్యాక గ్రామ పంచాయితీ రాజకీయాలతో శత్రువులుగా మారడం. ఆపై గొడవలు పడటం ట్రైలర్ లో చూపించారు.

అదే సమయంలో గ్రామ సర్పంచ్ గా ఉన్న సాయి కుమార్ పై కమిటీ కుర్రాళ్ళ నుంచి హీరో పోటీగా నిలబడటంతో పంచాయితీ రాజకీయాలని కథలో ఎస్టాబ్లిష్ చేశారు. కుర్రాళ్ళు తలుచుకుంటే, ప్రశ్నించడం మొదలుపెడితే పెద్దరికాలు చేస్తూ గ్రామాన్ని దోచుకునే ఎవరికైనా సమాధానం చెప్పొచ్చు అనే కాన్సెప్ట్ ని ట్రైలర్ ద్వారా రిప్రజెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో ప్రతి పల్లెల్లో ఇలాంటి పంచాయితీలు కనిపిస్తూ ఉంటాయి. కుర్రాళ్ళు వర్గాలుగా విడిపోయి గొడవలు పడుతూ ఉంటారు. అయితే ప్రశ్నించే గొంతుక ఉన్నప్పుడు తప్పు చేసే వాడు కూడా ఆలోచిస్తాడు అనే థీమ్ ని ఎస్టాబ్లిష్ చేసేలా కమిటీ కుర్రాళ్ళు కథ ఉండబోతోందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది. రియలిస్టిక్ సంఘటనలతో మన చుట్టూ జరిగిన కథలా అనిపించడంతో కమిటీ కుర్రాళ్ళు సినిమాపై పబ్లిక్ లో అటెన్షన్ క్రియేట్ అయ్యింది.

ఈ సినిమాతో యదు వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. నిహారికకి నిర్మాతగా ఇది మొదటి సినిమా కావడంతో మూవీపై చాలా హోప్స్ పెట్టుకుంది. మరి ఆడియన్స్ ఆగష్టు 9న ఈ సినిమాకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తారనేది వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News