రెండు రాత్రుళ్లో నా పని పూర్తి చేసారు
థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన అమ్మడు దొరికిన ఏ వేదికని క్షమించడం లేదు.
బాలీవుడ్ లో రాధికా ఆప్టే కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సీనియర్ భామలు ఎంత మంది ఉన్నా? నవ నాయికలు ఎంత మంది పోటీగా దూసుకొచ్చినా! రాధిక వేగానికి మాత్రం ఎవ్వరూ బ్రేకులు వేయలేకపోతున్నారు. థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన అమ్మడు దొరికిన ఏ వేదికని క్షమించడం లేదు. ఆన్ స్క్రీన్ నుంచి ఆఫ్ స్క్రీన్ వరకూ రాధిక మార్క్ పడాల్సిందే అంటుంది.
సినిమాలు..టెలివిజన్ షోస్..వెబ్ సిరీస్ లు ఇలా అన్నింటి నేనున్నాను కదా? అంటుంది. ట్యాలెంటెడ్ బ్యూటీకి అక్కడలా ప్రోత్సహం దక్కడంతో! బిజీ నటిగా కొనసాగుతుంది. ఇలా క్షణం తీరిక లేకున్నా ఇష్టమైన సినిమాలొస్తే గెస్ట్ అయినా అయిపోతుంది. తాజాగా అలాంటి సినిమా మరొకటి కమిట్ అవ్వడం ..షూటింగ్ పూర్తి చేయకుండా జరిగిపోయింది. విజయ్ సేతుపతి.. కత్రినా కైఫ్ జంటగా శ్రీరాం రాఘవన్ `మేరీ క్రిస్మస్` అనే చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇందులో రాధికా ఆప్టే ఓ కీలక అతిధి పాత్రలో మెరవనుంది. కీలక పాత్ర అంటే? ఓ ఐదారు సన్నివేశా లుంటాయి అనుకుంటారు. కానీ ఈ సినిమాలో రాధికకి కేవలం ఒకే సీన్ ఉందిట. మరి ఒక సన్నివేశం ఉంటే కీలక పాత్ర ఎలా అవుతుందంటే? అమ్మడు అందుకు ఓ మంచి లాజిక్ కూడా చెప్పింది. ఆ పాత్ర ఒప్పుకోవడానికి కేవలం దర్శకుడు అట. అతను మంచి మిత్రుడు కావడంతో ఆఫర్ కాదనలేకపోయిందిట.
ఆయన ప్రతీ సినిమాలోనూ కామన్ గా కనిపించడం కూడా మరో కారణం అంటోంది. ఓ రోజు ఫోన్ చేసి నీది ఒక్క సీన్..పరిమితమైన పాత్ర..చేస్తావా అని అడిగితే మారు మాట్లాడకుండా ఎస్ చెప్పాను` అంటోంది. ఒక్క సీన్ అయినా షూటింగ్ కోసం మాత్రం రెండు రాత్రుళ్లు పాల్గొనాల్సి వచ్చిందంది. మరి పారితోషికం ఎంత తీసుకుందో? కూడా చెప్పాలి కదా అమ్మడు.