కార్పొరేట్ బుకింగ్స్.. పుష్ప-2, దేవర కూడానా?
ఈ నేపథ్యంలో పుష్ప-1 సీక్వెల్ పుష్ప-2 తోపాటు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మేకర్స్ కూడా ఈ ట్రెండ్ కొనసాగిస్తారని సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.
గత కొద్ది రోజులుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కార్పొరేట్ బుకింగ్స్ మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రీసెంట్ గా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన సలార్ విషయంలోనూ ఈ వ్యవహారం తెర మీదకు వచ్చింది. సలార్ మూవీ భారీ స్థాయిలో కార్పొరేట్ బుకింగ్స్ జరుపుకున్నట్లు విమర్శలు రావడం తీవ్ర చర్చకు కారణమైంది.
అయితే కొన్నేళ్లుగా బాలీవుడ్ లో కార్పొరేట్ బుకింగ్స్ కల్చర్ కొనసాగుతోంది. అక్కడ తెరకెక్కిన అన్ని సినిమాలకు కార్పొరేట్ బుకింగ్స్ కామనే. కానీ దక్షిణాదిలో ఈ ఇప్పటి వరకు ఏ సినిమాకు కార్పొరేట్ బుకింగ్స్ జరగలేదని చెప్పొచ్చు. టాలీవుడ్ లో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ అదిరిపోతాయి. థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తాయి.
ప్రస్తుతం టాలీవుడ్ మేకర్స్ దాదాపు అందరూ పాన్ ఇండియా స్థాయిలోనే సినిమాలు రూపొందిస్తున్నారు. దీంతో తమ సినిమాల హిందీ వెర్షన్ కోసం కార్పొరేట్ బుకింగ్స్ ప్లాన్ ను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చి పుష్ప-1 సినిమా సమయంలో కార్పొరేట్ బుకింగ్స్ జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
హిందీ వెర్షన్ ద్వారా రూ.100 కోట్లు సాధించడానికి పుష్ప మేకర్స్ భారీగా కార్పొరేట్ బుకింగ్స్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ మూవీ రిలీజ్ టైమ్ లో కూడా మొదటి మూడు రోజులు.. మేకర్స్ కార్పొరేట్ బుకింగ్స్ జరిపినట్లు తెలిసింది. అయితే ఆదిపురుష్ స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమా కాబట్టి మేకర్స్ కోసం ఇలాంటివి చేయడం మామూలే.
ఇటీవలే రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయినా సలార్ మూవీ సుమారు రూ.50 కోట్లకు పైగా కార్పొరేట్ బుకింగ్స్ జరుపుకున్నట్లు విమర్శలు వచ్చాయి. వీటన్నింటిని చూస్తుంటే.. టాలీవుడ్ మేకర్స్ తమ పాన్ ఇండియా చిత్రాల కోసం కచ్చితంగా కార్పొరేట్ బుకింగ్స్ జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. అలా ఈ ట్రైండ్ కామన్ అయిపోతుందని సినీ పండితులు అంటున్నారు.
కార్పొరేట్ బుకింగ్స్ వల్ల ప్రేక్షకులు వెంటనే సినిమా టికెట్స్ బుక్ చేసే అవకాశం ఉందని భావిస్తూ ఈ ట్రెండ్ ఫాలో అవ్వనున్నారట. ఈ నేపథ్యంలో పుష్ప-1 సీక్వెల్ పుష్ప-2 తోపాటు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మేకర్స్ కూడా ఈ ట్రెండ్ కొనసాగిస్తారని సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.
ఇంతకీ కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏంటి?
స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాక, అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాకపోతే ఆ సినిమాలో నటించిన హీరో, లేదంటే సదరు నిర్మాణ సంస్థ కొన్ని కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసి, సినిమా చూసే అవకాశం కల్పిస్తాయి. తమ సినిమాకు ఎక్కువ టికెట్లు అమ్ముడు అవుతున్నాయని ప్రకటిస్తాయి. ఫ్రీ టికెట్ తో సినిమా చూసిన వాళ్లు సోషల్ మీడియా వేదికగా సదరు సినిమా గురించి పాజిటివ్ రివ్యూలు ఇస్తారు. అంటే కార్పొరేట్ బుకింగ్స్ చేసి వాళ్ల సినిమాను వాళ్లే ప్రమోట్ చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఇదో ఫేక్ కలెక్షన్ స్కామ్ అనవచ్చు.