వారం పాటు స‌మీక్ష‌లు ఆపాల‌ని హైకోర్టులో కేసు

సోష‌ల్ మీడియాలు, యూట్యూబ్ చానెళ్లు, వెబ్ మీడియాల్లో సినిమాల స‌మీక్ష‌లు వేగంగా వైర‌ల్ అవుతూ ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2023-10-08 10:07 GMT

సోష‌ల్ మీడియాలు, యూట్యూబ్ చానెళ్లు, వెబ్ మీడియాల్లో సినిమాల స‌మీక్ష‌లు వేగంగా వైర‌ల్ అవుతూ ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆన్‌లైన్ సమీక్షకులు విమర్శకులపై ఇప్పుడు కోర్టు కేసు దాఖలు అయింది. యాధృచ్ఛికంగా కేరళ హైకోర్టు ఈ కేసును స్వీకరించింది. ఆన్‌లైన్ లో సినిమా సమీక్షకుల కోసం స్పష్టమైన మార్గదర్శకాలను సమర్పించాలని భారత ప్రసార మంత్రిత్వ శాఖకు నోటీసు పంపింది. `ఆరోమాలింటే ఆదితే ప్రాణాయామ్` అనే మలయాళీ చిత్రం దర్శకుడు ముబీన్ రవూఫ్ కేరళ హైకోర్టులో కేసు దాఖలు చేయ‌డంతో ఇదంతా మొద‌లైంది.

తన సినిమాపై ఆన్‌లైన్ సమీక్షకులు ఎవరైనా థియేటర్లలో విడుదలైనప్పటి నుండి ఒక వారం పాటు సమీక్షలను రాయ‌కుండా నిషేధించాలని అత‌డు కోరారు. తన పిటిషన్‌లో ఈ ఆన్‌లైన్ సమీక్షలు సినిమాలపై ప్రతికూల కథనాన్ని వ్యాప్తి చేస్తున్నాయని అవి డిఫాల్ట్‌గా చిత్ర పరిశ్రమకు మంచివి కావని ఆరోపించారు. ఈ ప్రతికూల సమీక్షలు చిత్ర పరిశ్రమ ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయని, దీని వలన వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. కేరళ హైకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించింది. ఆన్‌లైన్ సమీక్షలపై స్పష్టమైన మార్గదర్శకాల కోసం కేంద్ర మంత్రిత్వ శాఖను కోరింది.

థియేట్రికల్ విడుదల నుండి ఏడు రోజుల పాటు ఈ చిత్రంపై సమీక్షకులు తమ సమీక్షలను షేర్ చేయ‌కుండా ఉండాలనేది పిటిషన్. దీనిపై త‌దుప‌రి కోర్టు విచారించ‌నుంది. త‌దుప‌రి హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. సినీస‌మీక్ష‌కుల‌ మించి ఆన్ లైన్ పైర‌సీ ప‌రిశ్ర‌మ‌ను పెద్ద ఎత్తున న‌ష్టాల‌కు గురి చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News