సూప‌ర్ స్టార్ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్!

ఈ సినిమాకి సంబంధించి ర‌జ‌నీకాంత్ డ‌బ్బింగ్ ప‌నులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. త్వ‌ర‌లోనే ఆ ప‌నులు ప్రారంభం కానున్నాయి.

Update: 2024-08-18 09:19 GMT

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా టి.జె. జ్ఞాన్ వేల్ ద‌ర్శ‌క‌త్వంలో 'వెట్టేయాన్' భారీ అంచ‌నాల మ‌ధ్య‌ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. 'జైభీమ్' త‌ర్వాత జ్ఞాన్ వేల్ తెర‌కెక్కిస్తోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. ఇప్ప‌టికే ర‌జ‌నీకాంత్ పాత్ర షూటింగ్ కూడా పూర్త‌యింది. అటుపై ర‌జ‌నీ కొత్త సినిమా షూటింగ్ కూడా మొద‌లుపెట్టారు.

కానీ ఇంత‌వ‌ర‌కూ మ‌ళ్లీ 'వెట్టేయాన్' గురించి ఎలాంటి అప్ డేట్ యూనిట్ నుంచి బ‌య‌ట‌కు రాలేదు. దీంతో సినిమా ఆల‌స్య‌మ‌వు తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. షూటింగ్ పూర్త‌యిన డిలే అవ్వ‌డంతో రీషూట్ కి వెళ్తున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో రిలీజ్ తేదీ కూడా ప్ర‌క‌టించ‌డం లేద‌నే వార్త‌లొస్తున్నాయి. అయితే అన్నింటికి తెర దించుతూ సోమ‌వారం 10 గంట‌ల‌కు అప్ డేట్ ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

అధికారికంగా రిలీజ్ తేదీ ప్ర‌క‌ట‌న ఉండే అవ‌కాశం ఉంద‌ని అభిమానులు భావిస్తున్నారు. సినిమాకి సంబంధించిన ప్ర‌చార చిత్రాలు కూడా ఇంత‌వ‌ర‌కూ రిలీజ్ చేయ‌లేదు. కొన్ని పొస్ట‌ర్లు మిన‌హా ర‌జ‌నీ మార్క్ హీటెక్కించే గ్లింప్స్ ఏవీ రాలేదు. అయితే తాజా స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ఇక‌పై యూనిట్ ఆ ప‌నుల్లో నిమ‌గ్న మ‌వుతుంద‌ని తెలుస్తోంది. రిలీజ్ తేదీని బ‌ట్టి ప్ర‌చారం ప్లాన్ చేసుకోనున్నారు.

ఈ సినిమాకి సంబంధించి ర‌జ‌నీకాంత్ డ‌బ్బింగ్ ప‌నులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. త్వ‌ర‌లోనే ఆ ప‌నులు ప్రారంభం కానున్నాయి. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ 'కూలీ' అనే చిత్రం తెర‌కెక్కిస్తున్నారు. గోల్డ్ స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతుంది. ఇందులో ర‌జ‌నీ కాంత్ గోల్డ్ స్మ‌గ్ల‌ర్ పాత్ర పోషిస్తున్నారు.

Tags:    

Similar News