డాకు మహారాజ్ డిజిటల్ హంగామాకి సిద్ధమా..?
బాలయ్య మా సినిమా చేయడం కామనే కానీ స్టైలిష్ యాక్షన్ అది కూడా బాబీ మార్క్ టేకింగ్ తో వస్తే ఎలా ఉంటుందో డాకు మహారాజ్ తో చూపించారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా కె ఎస్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ మూవీస్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ నందమూరి ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ అందించింది. బాలయ్య మా సినిమా చేయడం కామనే కానీ స్టైలిష్ యాక్షన్ అది కూడా బాబీ మార్క్ టేకింగ్ తో వస్తే ఎలా ఉంటుందో డాకు మహారాజ్ తో చూపించారు.
ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్స్ గా నటించగా ఊర్వశి రౌతెలా స్పెషల్ రోల్ చేశారు. పొంగల్ కి బాలయ్య సినిమా వస్తే పక్కా హిట్ అనే సెంటిమెంట్ ని మరోసారి ఈ సినిమా ప్రూవ్ చేసింది. థియేట్రికల్ రిలీజ్ లో సక్సెస్ సాధించిన డాకు మహారాజ్ ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కు రెడీ అయ్యింది. డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూశారు. ఐతే వారి ఎదురుచూపులు ఫలిచినట్టుగా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు.
డాకు మహారాజ్ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమాపై ఉన్న అంచనాలు తెలుసు కాబట్టి రిలీజ్ ముందే ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనేసినట్టు తెలుస్తుంది. ఐతే ఈ సినిమాను ఫిబ్రవరి 21న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా వచ్చేసింది. స్టార్ సినిమాలు ఓటీటీ రిలీజ్ డేట్ సినిమా రిలీజైన ఎనిమిది వారాల కండీషన్ ఉంది. ఐతే కొన్ని సినిమాలకు ఆ కండీషన్ ని సడలిస్తారు.
జనవరి 12న డాకు మహారాజ్ రిలీజ్ కాగా సినిమా రిలీజైన 40 రోజుల్లో ఓటీటీ రిలీజ్ అవుతుంది. థియేట్రికల్ లో హిట్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి. ఇప్పటికే డాకు మహారాజ్ సాంగ్స్ వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఇక సినిమా ఓటీటీ రిలీజ్ అయ్యాక మరింత హంగామా జరిగేలా ఉంది. డాకు మహారాజ్ తర్వాత బాలయ్య బోయపాటి శ్రీనుతో అఖండ 2 చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఈ ఇయర్ దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.