డాకూ మహారాజ్ యూఎస్ ప్రీమియర్స్: బాలయ్య మ్యాజిక్ కొనసాగేనా?

బాలకృష్ణకు అమెరికాలో ఉన్న ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ కారణంగా, ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ సాధ్యమైందని చెప్పొచ్చు.

Update: 2025-01-11 08:23 GMT

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన డాకూ మహారాజ్ రిలీజ్ కు బాక్సాఫీస్ సిద్ధమైంది. ఇటీవల కాలంలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న బాలయ్య ఈసారి కూడా మేజిక్ క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రిలీజ్ ట్రైలర్ పై కూడా అద్భుతమైన రెస్పాన్స్ అయితే వస్తోంది. ఇక ఓవర్సీస్ లో కూడా సినిమాను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

ప్రత్యేకంగా యూఎస్ ప్రీమియర్ షోల పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రేడ్ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం, ప్రీమియర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటివరకు $354,797 కలెక్షన్ వచ్చింది. ఈ మొత్తాన్ని 210 లొకేషన్లలో 589 షోలు ద్వారా 14,818 టికెట్లు అమ్ముడవడం ద్వారా సాధించడం విశేషం.

మొత్తం నార్త్ అమెరికా ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ ప్రస్తుతం $390K వద్ద ఉంది. అయితే, కొన్ని షోలు క్యాన్సిల్ అవడం, మరికొన్ని హోల్డ్‌లో ఉండటం వలన ఈ డేటా మార్పు చెందే అవకాశం ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే, సినిమా ప్రీమియర్ వసూళ్లు $550K-$600K వరకు చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బాలకృష్ణకు అమెరికాలో ఉన్న ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ కారణంగా, ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ సాధ్యమైందని చెప్పొచ్చు. అయితే, శనివారం ప్రీమియర్స్ ఉండటంతో ట్రేడ్ అనలిస్టులు మరింత భారీ వసూళ్లను ఆశించనున్నారు. అఖండ తర్వాత బాలయ్యకు ఈ సినిమా రెండో అత్యధిక ప్రీమియర్ వసూళ్లను అందించనుంది. ఈ ప్రీమియర్ వసూళ్లతోనే డాకూ మహారాజ్ యూఎస్ బాక్సాఫీస్‌పై తన సత్తా చాటుతుందని బాలయ్య అభిమానులు ఆశిస్తున్నారు.

ప్రత్యేకంగా బాలకృష్ణ యాక్షన్, డైలాగ్ డెలివరీ, మరియు మాస్ అప్పీల్ ఈ సినిమాను మరింత హైప్‌కి గురి చేస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా ప్రీమియర్స్ ముగిసిన తర్వాత వచ్చే వసూళ్లు, మౌత్ టాక్ సినిమా భవిష్యత్తును నిర్ధారిస్తాయి. అయితే, ఇప్పటి వరకు ఉన్న హైప్, ప్రీ-బుకింగ్స్, బాలయ్య స్టార్ పవర్‌తో ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా, డాకూ మహారాజ్ యూఎస్ ప్రీమియర్ షోలు బాలయ్య అభిమానులకు పండగనే చెప్పాలి. ప్రీమియర్ వసూళ్లలో ప్రతిసారి కొత్త రికార్డులను సాధించే బాలయ్య ఈ సారి కూడా అదే మ్యాజిక్‌ని కొనసాగిస్తారో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News