విడిపోయిన తర్వాత భర్తపై కేసు పెట్టిన నటి!
బాలీవుడ్ నటి దిల్జీత్ కౌర్-నిఖిల్ పటేల్ ఇటీవల విడిపోయిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ నటి దిల్జీత్ కౌర్-నిఖిల్ పటేల్ ఇటీవల విడిపోయిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య విబేధాల కారణగా విడిపోతున్నట్లు ఇరువురు ప్రకటించారు. అటుపై దిల్జీత్ కౌర్ కెన్యా నుంచి కుమారుడితో ఇండియాకి తిరి గొచ్చేసింది. నికిల్ పటేల్ కి సఫీనా నాజర్ అనే యువతితో అక్రమం సంబంధం ఉండటంతోనే దిల్జీత్ కౌర్ విడాకులు ఇచ్చిందన్నది ఆమె వాదన కాగా, కెన్యా ప్రాంతంలో ఉండలేక విడిపోతున్నట్లు నిఖిల్ పటేల్ తన వాదన గా చెప్పుకొచ్చాడు.
ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఎవరికి వారు విడిపోయారు. దీంతో వివాదం ఇక్కడితో సద్దుమణి గిందనుకున్నారంతా. కానీ తాజాగా దిల్జీత్ కౌర్ మాజీ భర్త నిఖిల్ పటేల్ పై ముంబై లో కేసు పెట్టింది. నిఖిల్ తనని మోసం చేసాడని, తల్లిదండ్రులతో కలిసి వేధింపులకు గురిచేసాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ఫిర్యాదుపై స్పందించడంతో వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసింది. నేను పోలీస్ స్టేషన్ లో ప్రవేశించడానికి భయపడ్డాను.
కానీ మహిళలకు మన దేశంలో సురక్షితమైన వాతావరణం ఉన్నందుకు పోలీసులకు ధన్యవాదాలు. ఇంతవరకూ నాలోనే దాచుకున్న భావోద్వేగాల్నిబయట పెట్టకుండా ఉండలేకపోయాను. అందుకు ఇదే సరైన సమయంగా భావించి ఓపెన్ అయినట్లు తెలిపింది. దీంతో నిఖిల్ పటేల్ పై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
మరి మాజీ భార్య వేసిన కేసుకు ప్రతిగా నిఖిల్ పటేల్ కూడా కేసులు వేస్తాడా? న్యాయపరమైన పోరాటానికి దిగుతాడా? లేదా? అన్నది తేలాలి. ఇంత వరకూ నిఖిల్ పటేల్ ఈ కేసుపై ఇంకా స్పందించలేదు. ఇద్దరికి పెళ్లై పదినెలలు అయింది. ఇంతలోనే ఇద్దరి మధ్య విబేధాలతో దూరమయ్యారు. ఇటీవలే ప్రియురాలితో నిఖిల్ పటేల్ ముంబై లో హల్చల్ చేసాడు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.