ఒకేసారి 9 చిత్రాలు.. థియేటర్ల పరిస్థితేంటో?

వివరాళ్లోకి వెళితే.. ఇప్పటికే పలు తెలుగు చిత్రాలతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా దసరా బెర్త్ ఖరారు చేసేసుకున్నాయి.

Update: 2023-09-20 14:30 GMT

చిత్ర పరిశ్రమకు సంక్రాంతి తర్వాత దసరా బిగ్గెస్ట్ సీజన్. ప్రతి విజయ దశమికి కనీసం రెండు పెద్ద సినమాలతో పాటు మరికొన్ని మీడియం రేంజ్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఈ ఏడాది కూడా దసరా పండగ.. చిత్ర పరిశ్రమలో కొత్త ఊపు తీసుకురాబోతోంది. దీంతో పాటే థియేటర్ల సమస్యను కూడా తీసుకురాబోతుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే ఏవైనా చిత్రాలు వాయిదా పడాల్సిందే.

వివరాళ్లోకి వెళితే.. ఇప్పటికే పలు తెలుగు చిత్రాలతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా దసరా బెర్త్ ఖరారు చేసేసుకున్నాయి. వాటిలో తెలుగు నుంచి బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, కోలీవుడ్ నుంచి దళపతి విజయ్ లియో, హిందీ నుంచి టైగర్ ష్రాఫ్ గణపత్, కంగనా రనౌత్ తేజస్, కన్నడ నుంచి శివ రాజ్​కుమార్​ ఘోస్ట్.. ఇంకా యారియన్ 2, కిల్లర్స్​ ఆఫ్ ది ఫ్లవర్ మూన్​ చిత్రాలు వస్తున్నాయి. ఇవన్నీ అక్టోబర్​ 19కి ఓ రోజు అటు ఇటుగా వస్తున్నాయి.

ఈ చిత్రాలన్నింటిలో తెలుగు, తమిళ బాక్సాఫీస్​ ముందు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియోపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే తెలుగులో బాలయ్య వర్సెస్​ విజయ్​ వర్సెస్​ రవితేజగా పోటీ ఉండగా.. కోలీవుడ్​లో మాత్రం అంతా లియో హడావిడి మాత్రమే కనిపించేలా ఉంది. ఇక కన్నడలో ఘోస్ట్​, బాలీవుడ్​లో గణ్​పత్​కు మంచి హైప్​ ఉంది. వీటితో పాటే రాబోయే ఇతర చిత్రాలను పరిశీలిస్తే.. అంతగా బజ్​ ఏమీ లేదు. కానీ వాటికి కూడా థియేటర్లు కొన్నైనా దక్కుతాయి.

కాబట్టి ఇన్ని బడా చోటా చిత్రాలు ఒకేసారి రావడం వల్ల థియేటర్ల సమస్య ఏర్పడే అవకాశం తప్పక ఉంటుంది. కాబట్టి వీటిలో ఏమైనా చిత్రాలు ఓ వారం వెనక్కి సెప్టెంబర్ 13 లేదా 15కు ప్రీ పోన్ చేసుకుంటే థియేటర్ల సమస్యను అధిగమించొచ్చు. కానీ ఆ పరిస్థితి కనపడట్లేదు. అందరూ దసరా పండక్కే రావాలని అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Tags:    

Similar News