ఆ స్టార్ బ్యాటర్ ఛాన్స్ కోసం చూస్తున్నాడా?
సినిమాల్లో ఛాన్సులు రావాలేగానీ నటించడానికి చాలా మంది క్రికెట్ ప్లేయర్లు సిద్దంగా ఉన్నారు.
సినిమాల్లో ఛాన్సులు రావాలేగానీ నటించడానికి చాలా మంది క్రికెట్ ప్లేయర్లు సిద్దంగా ఉన్నారు. రిటైర్ అయిన వారు..రన్నింగ్ లో ఉన్న వారు సైతం ఛాన్స్ వస్తే మ్యాకప్ వేసుకోవాలని చూస్తున్నారు. మరి అలాంటి ఛాన్స్ ఏదైనా డేవిడ్ వార్నర్ కి ఎవరైనా ఇచ్చారో? ఏమోగానీ తాజాగా అతడి న్యూలుక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అందులో వార్నర్ సినిమా హీరోలాగే ముస్తాబయ్యాడు.
రంగుల షర్ట్..తెల్ల ప్యాంట్ ధరించాడు. చేతిలో గన్ పట్టుకుని గురి పెట్టి? ట్రిగ్గర్ నొక్కడానికి రెడీ అవుతు న్నాడు. కళ్లకు నల్లటి అద్దాలు పెట్టాడండోయ్ ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటి జనులు ఇది సినిమాలో స్టిల్ ? అంటూ సందేశిస్తున్నారు. ఇక వార్నర్ డాన్స్ అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు. తన ఇష్టాన్ని పుష్పలో శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి ప్రపంచానికి చాటి చెప్పాడు.
అతడు చేసిన రీల్స్ కి నెట్టింట మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేనా ఆ దూకుడు గ్రౌండ్ లోనూ చూపించాడు. అదే పాటకు ఎన్నోసార్లు స్టెప్పులేసి గ్యాలరీలో ప్రేక్షకుల్ని అలరించాడు. ఆ క్రేజ్ తోనే రాజమౌళి తో యాడ్ చేసే అవకాశం కూడా తెచ్చి పెట్టింది. అందులో తన యాక్టింగ్ తో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాడు.
అతడి ఫ్యాషన్ చూసి `పుష్ప-2` సినిమాలో సుకుమార్ చిన్న అవకాశం ఇచ్చినా బాగుందేని నెటి జనులు కోరుకున్నారు. కానీ ఆ ఛాన్స్ లేకపోయే. మరి ఇప్పుడు మిస్ అయినా వార్నర్ ఫ్యాషన్ గురించి ఇంకేవరైనా అవకాశం ఇస్తారేమో చూడాలి. ఇక బ్యాటర్ గా వార్నర్ విధ్వంసం గురించి చెప్పాల్సిన పనిలేదు. అతడు క్రీజులో ఉన్నంత సేపు బంతి బాబోయ్ అంటూ పరుగులు తీస్తుంది.