ఆడియన్స్ మరి అంత వెర్రివాళ్లలా కన్పిస్తున్నారా..?

కొన్ని సినిమాలు ప్రేక్షకుల మేధస్సుకు పదును పెట్టేలా చేస్తుంటాయి. కొన్ని సినిమాలు వారి అంచనాలను దాటి మెస్మరైజ్ చేస్తాయి.

Update: 2024-04-08 11:30 GMT

కొన్ని సినిమాలు ప్రేక్షకుల మేధస్సుకు పదును పెట్టేలా చేస్తుంటాయి. కొన్ని సినిమాలు వారి అంచనాలను దాటి మెస్మరైజ్ చేస్తాయి. హీరో విలన్ కాన్సెప్ట్ నుంచి కొత్త కథలతో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు సత్తా చాటుతున్నాయి. అయితే కొందరు మేకర్స్ మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను చాలా తక్కువ అంచనా వేస్తూ సినిమాలు చేస్తుంటారు. ఆల్రెడీ వచ్చిన సినిమా కథనే కాస్త అటు ఇటుగా మార్చి మరో సినిమా చేస్తారు. కరోనా వల్ల వచ్చిన డిజిటల్ విప్లవం వల్ల ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో వచ్చిన కొత్త కంటెంట్ కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుంది.

అందుకే జస్ట్ పోస్టర్ కాపీ అనిపించినా నానా రచ్చ చేసేస్తున్నారు. ఇక సినిమాను పోలిన సినిమాలు.. కథను పోలిన కథలతో వస్తే మాత్రం బాబోయ్ అనేస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు ఎందుకు అంతా ఈ లీడ్ అంటే మలయాళంలో వచ్చిన గుడ్ నైట్ సినిమా తరహా కథతోనే తమిళంలో డియర్ అనే సినిమా వస్తుంది. మలయాళంలో వచ్చిన గుడ్ నైట్ సినిమాలో మణికందన్, మీథా రఘునాథ్ లీడ్ రోల్ లో నటించారు.

డిస్నీ హాట్ స్టార్ లో రిలీజైన ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఐతే కోలీవుడ్ లో త్వరలో రిలీజ్ కాబోతున్న డియర్ సినిమా కూడా ఇంచుమించు ఇలాంటి కథతో వస్తుంది. గుడ్ నైట్ సినిమాలో హీరోకి గురక సమస్య ఉంటే.. డియర్ సినిమాలో హీరోయిన్ కు ఆ సమస్య పెట్టారు. డియర్ సినిమాలో జివి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ గా నటించారు. ఆనంద్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ లేటేస్ట్ గా రిలీజైంది.

డియర్ టీజర్ చూశాక గుడ్ నైట్ సినిమాను గుర్తు చేసుకోక తప్పదు. మరి ఆ సినిమా చూశాక దర్శకుడు ఈ కథ రాసుకున్నాడా లేదా అంతకుముందే ఈ ఆలోచన ఉందో తెలియదు కానీ హీరోలు, విలన్లు, ఫైట్లు, చేంజింగ్ లు ఇలాంటివి లేకుండా భార్యాభర్తల మధ్య కన్ ఫ్లిక్ట్ పాయింట్ తో మొన్న గుడ్ నైట్ రాగా ఇప్పుడు డియర్ వస్తుంది. ఐతే గురక సమస్య తో అదే తరహా కథతో రెండు సినిమాలు రావడం ఆశ్చర్యపరుస్తుంది. గుడ్ నైట్ లో మగవాళ్ల గురక ఎంత తలనొప్పి తెస్తుంది అన్నది చూపిస్తే.. డియర్ లో ఆడవాళ్ల గురక ఎన్ని అనర్థాలకు దారి తీస్తుంది అన్నది చూపించబోతున్నారు. మొత్తానికి ఆడియన్స్ ని పిచ్చోళ్లని చేద్దామనే ఆలోచతోనా లేక ఇలా కూడా ఎంటర్టైన్ అందొచ్చు అనే ఉద్దేశంతోనో ఈ సినిమా వస్తుంది. మరి ఈ సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి.

Tags:    

Similar News