డిసెంబర్ టోటల్ లాక్..థియేటర్లు కిటకిట!
కోట్ట రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తిచేసుకుని ప్రేక్షకుల తుది తీర్పుకోసం వస్తున్న చిత్రాలు.
దసరా ధమాకా దిగ్విజయంగా పూర్తయింది. 'భగవంత్ కేసరి'..'లియో'..'టైగర్ నాగేశ్వరావు' చిత్రాలతో ఈ దసరా షురూ అయింది. పండగ సీజన్..సెలవులు కాబట్టి ఈ మూడు సినిమాలకు ఎలా లేదన్నా కలెక్షన్ల విషయంలో ఢోకా లేదు. బాలయ్య సినిమా మిగతా రెండింటికంటే మంచి టాక్ దక్కించుకుంది. ఆ లెక్కన అసలైనా దసరా బాలయ్యదనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల పరంగా బాలయ్య దూకుడికి తిరిగుండదు.
ఇంకా దసరా సందర్భంగా కొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆ సంగతి పక్కనబెడితే తదుపరి వచ్చేది క్రిస్మస్ సీజన్. దీంతో డిసెంబర్ లోనూ భారీగానే సినిమాలు కనిపిస్తున్నాయి. నెల ఆరంభం నుంచి ముగింపు వరకూ ఏదో ఒక సినిమా రిలీజ్ రేసులో కనిపిస్తుంది. నాలుగు శుక్రవారాల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్నాయి. టాలీవుడ్ తో పాటుకోలీవుడ్..బాలీవుడ్ అన్ని భాషల్లోనూ పెద్ద ఎత్తున రిలీజ్ లు జరుగుతున్నాయి.
డిసెంబర్ 1న 'యానిమల్' రిలీజ్ అవుతుంది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తోన్న సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది. ఇక డిసెంబర్ 7న నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న 'హాయ్ నాన్న' రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు మంచి హైప్ తీసుకొచ్చాయి. డిసెంబర్ 8న నితిన్ 'ఎక్స్ ట్రా' రిలీజ్ అవుతుంది. అదే రోజున వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలంటైన్'..'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.
ఆ మరుసటి రోజున 'రౌడీబోయ్స్' ఫేం అశిష్ నటిస్తున్న 'సెల్పీష్' రిలీజ్ అవుతుంది. అలాగే డిసెంబర్ 15న ధనుష్ నటిస్తోన్న `కెప్టెన్ మిల్లర్` రిలీజ్ అవుతుంది. ఇక 'సలార్' అదే నెల 22న రిలీజ్ అవుతుంది. అదే రోజున షారుక్ ఖాన్ కూడా `డంకీ`తో బరిలోకి దిగుతున్నాడు. ఇద్దరి మధ్య బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్దమే జరుగు తుందని అంచనాలున్నాయి. ఇవన్నీ భారీ అంచనాల మధ్య వస్తున్న సినిమాలు.
కోట్ట రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తిచేసుకుని ప్రేక్షకుల తుది తీర్పుకోసం వస్తున్న చిత్రాలు. ఇంకా చాలా సినిమాలు ఆ నెలలోనే రిలీజ్ అవుతున్నాయి. డిసెంబర్ మిస్ అయితే మళ్లీ రిలీజ్ కి రెండు..నెలలు ఆగక తప్పదు. ఎందుకంటే సంక్రాంతి అగ్ర హీరోల సినిమాలన్నీ క్యూలో ఉన్నాయి. థియేటర్లన్నీ వాటికే కేటాయిస్తారు కాబట్టి డిసెంబర్లో చాలా సినిమాలు వచ్చేస్తాయి. దీంతో ఆనెలంతా థియేటర్లన్నీ కోలాహాలంగా మారుతాయి.