దీపిక కూతురికి ఆయమ్మ అవసరం లేదట
పలువురికి నానీ అవసరమైంది.. కానీ దీపికా పదుకొనే తన కుమార్తె కోసం నానీని నియమించుకునే ఆలోచనతో లేదని సమాచారం.
సెలబ్రిటీ కపుల్స్ బిజీ షెడ్యూళ్ల దృష్ట్యా వారు తమ పిల్లలను చూసుకోవడానికి ప్రత్యేకించి నానీ(ఆయమ్మ)లను నియమించుకుంటున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్- ఉపాసన దంపతులు తమ గారాల పట్టీ క్లిన్ కారాను చూసుకునేందుకు భారీ మొత్తం జీతం చెల్లిస్తూ కొన్ని నెలల పాటు పాపులర్ సెలబ్రిటీ నానీని నియమించుకున్నారు. ఇంతకుముందు ఈ ఆయమ్మ సైఫ్ అలీఖాన్- కరీనా కపూర్ దంపతుల బిడ్డను సాకేందుకు పటౌడీ సంస్థానంలో పని చేసింది. పలువురు సెలబ్రిటీ కిడ్స్ కి నానీగా ఆమె పని చేసారు.
పలువురికి నానీ అవసరమైంది.. కానీ దీపికా పదుకొనే తన కుమార్తె కోసం నానీని నియమించుకునే ఆలోచనతో లేదని సమాచారం. అనుష్క శర్మ తన పిల్లల విషయంలో ఎలాంటి పేరెంటింగ్ స్టైల్‌ను అనుసరిస్తోందో దానినే తాను కూడా అనుసరించాలని దీపిక అనుకుంటోందట. అనుష్క శర్మ ప్రస్తుతం పిల్లలతో కలిసి లండన్ లో నివాసం ఉంటోంది. ఇటీవల ఒక ఆడబిడ్డకు తల్లి అయిన దీపికా పదుకొణె తన లిటిల్ ప్రిన్సెస్ కోసం నానీని నియమించుకునే ఆలోచనతో లేదు. బాలీవుడ్ లైఫ్ కథనం ప్రకారం.. దీపిక తన కుమార్తెను పోషించడంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, అనుష్క శర్మ మార్గాన్ని అనుసరించేందుకే ఆసక్తిగా ఉన్నారని కథనాలొస్తున్నాయి. ఆమె నానీని ఎంపిక చేసుకోదు.. కానీ ప్రయోగాత్మక తల్లిగా ఉంటుందని చెబుతున్నారు.
ఇది మాత్రమే కాదు.. దీపికా పదుకొనే - రణవీర్ సింగ్ కూడా తమ కుమార్తె కోసం రణబీర్ కపూర్-ఆలియా భట్ .. అనుష్క శర్మ-విరాట్-కోహ్లీల తరహాలో `నో ఫోటో` విధానాన్ని అనుసరించవచ్చని తెలుస్తోంది. తాజా కథనాల ప్రకారం దీపిక-రణవీర్ తమ బిడ్డను ప్రస్తుతానికి మీడియా నుండి దూరంగా ఉంచుతారు. సరైన సమయం వచ్చినప్పుడు ఆమెను ప్రపంచానికి పరిచయం చేయవచ్చని భావిస్తున్నారు.
దీపికా - రణవీర్‌లకు సెప్టెంబర్ 8న ఆడబిడ్డ పుట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వారు `వెల్కమ్ బేబీ గర్ల్` అనే పోస్ట్‌ను షేర్ చేశారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ జంట కు శుభాకాంక్షలు చెబుతూ, వారి లిటిల్ ప్రిన్సెస్‌పై ప్రేమను కురిపించారు.