దీపికా పదుకొణేతో రోహిత్ శెట్టి సోలో సింగం!
తాజాగా దీనికి సంబంధించి రోహిత్ శెట్టి స్పందించాడు. 'దీపిక ప్రధాన పాత్రలో నటించాలంటే సరైన స్టోరీ కుదరాలి.
'సింగం ఎగైన్' తో దీపికా పదుకొణే రోహిత్ శెట్టి కాప్ యూనివర్శ్ లోకి ఎంటర్ అయింది. పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ శక్తి శెట్టి పాత్రలో దీపిక పెర్పార్మెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫస్ట్ లుక్ దీపిక పోస్టర్ రిలీజ్ అయిన నాటి నుంచి ఆ పాత్ర ఎలా ఉంటుంది? అన్న ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో కనిపించింది. ఆ విషయంలో దీపిక ఏమాత్రం డిజ ప్పాయింట్ చేయకుండా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా దీపికతో సోలో సింగం చిత్రాన్ని ప్రకటించి సర్ ప్రైజ్ చేసాడు.
దీపిక మెయిన్ పాత్రలో ఓ చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇది దీపికా పదుకొణే అభిమానులు మరో భారీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పటికే అమ్మడు 'పద్మావత్' లాంటి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సోలోగా సత్తా చాటింది. ఇప్పుడు దీపిక కటౌట్ కి తగ్గ కంటెంట్ తో పుల్ లెంగ్త్ పాత్రతో స్పెషల్ ట్రీట్ ఇవ్వనుంది. తాజాగా దీనికి సంబం ధించి రోహిత్ శెట్టి స్పందించాడు. 'దీపిక ప్రధాన పాత్రలో నటించాలంటే సరైన స్టోరీ కుదరాలి.
ప్రస్తుతానికి ఈ ఆలోచన కేవలం నా మనసులోనే ఉంది. కానీ ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియదు. 2018 వరకు కాప్ యూనివర్స్ లో మహిళా నటుల్ని యాడ్ చేయాలనే ఆలోచనలేదు. అక్షయ్ కుమార్ నటించిన 'సూర్యవంశీ' చిత్రాన్ని రూపొందిస్తున్న సమయంలో మహిళా పోలీసును తీసుకురావాలనే? ఆలోచన వచ్చింది. అలా ప్రాజెక్ట్ లోకి లేడీ సింగంలు ఎంటర్ అయ్యాయి. దీపికతో సోలో సినిమా అనుకున్నా? దీపిక గురించి నాకు తెలిసింది చాలా తక్కువ.
ఓ ఆలోచన ఉంది. కానీ దాంతో ఎంత దూరం వెళ్తానో తెలియదు. దీపిక గురించి చాలా స్టడీ చేయాల్సింది. నాకు కేవలం ఓ నటిగానే తెలుసు. ఆమె గురించి కొంత ప్రాధమిక సామాచారం ఉంది. కానీ కాప్ స్టోరీ చేయాలంటే అది సరిపోదు. ఓ దర్శక, రచయితగా ఆమె గురించి ఇంకా తెలుసుకోవాలి' అని అన్నారు.