బేబి బంప్: ఆలియాను ఫాలో అవుతున్న దీపిక
రణవీర్ సింగ్ - దీపికా పదుకొనే జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న ఆనందంలో ఉన్న సంగతి తెలిసిందే.
రణవీర్ సింగ్ - దీపికా పదుకొనే జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న ఆనందంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట ఇటీవలే ఇన్‌స్టా ద్వారా తమ మొదటి బిడ్డను స్వాగతిస్తున్నామని ప్రకటించినప్పటి నుండి నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. ఇటీవలే దీపిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. తన అధికారిక ఇన్ స్టాలో ఫోటోల స్ట్రింగ్‌ను షేర్ చేస్తూ కాబోయే మమ్మీ ఫుల్ గ్లోతో తన అభిమానులను ఆశ్చర్యపరిచింది.
షైనీ ఎల్లో కలర్ మ్యాక్సీ డ్రెస్‌లో దీపిక చాలా అందంగా కనిపించింది. ప్రిన్సెస్-కట్ నెక్‌లైన్‌తో కూడిన స్లీవ్‌లెస్ గౌనులో సహజ సౌందర్యాన్ని పెంచే ఫ్లెర్డ్ సిల్హౌట్‌ను అందంగా దీపిక ధరించింది. అందమైన చిరునవ్వుతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. ముంబైలోని ఒక దుకాణాన్ని సందర్శించి, తన అందానికి కారణమైన ఉత్పత్తుల గురించి చర్చించింది. అయితే ఈ ఫోటోగ్రాఫ్స్ లో ప్రజలు బేబీ బంప్‌ను గమనించకుండా ఉండలేకపోయారు.
దీపికా పదుకొణె బేబి బంప్ ప్రదర్శనపై చాలామంది రకరకాలుగా స్పందించారు. ఇందులో ట్రోల్స్ కూడా ఉన్నాయి. అలాగే 2024 లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేయడానికి రణవీర్ సింగ్‌తో కాబోయే తల్లి దీపికా పదుకొనే క్యూలోకి వచ్చిన ఫోటోలు వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. 2024 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ఐదవ దశ సందర్భంగా మే 20న ముంబైలో ఓటు వేయడానికి బయలుదేరినప్పుడు దీపికా మొదటిసారిగా తన బేబీ బంప్‌తో కనిపించింది.
అయితే ఇటీవలి పసుపు రంగు గౌనులో దీపిక లుక్ మాత్రం ఆలియా ఫ్రెగ్నెన్సీ సమయంలో ఫోటోషూట్ కి కాపీ అంటూ ఒక ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు దీపిక పసుపు రంగు గౌనులో బేబి బంప్ ని ప్రదర్శిస్తున్న ఫోటోలకు, ఆలియా అదే తరహా పసుపు రంగు గౌనులో ఫోజులిచ్చిన ఫోటోలను జత చేసి ఇదిగో ఇన్ స్పిరేషన్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం దీపిక- ఆలియా సేమ్ టు సేమ్ బేబి బంప్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.