హీరోయిన్లు అందరికీ ఆమె రెమ్యునరేషన్ షాక్
బాలీవుడ్ లో దీపికా పదుకొణే రేంజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ వద్ద సోలోగానూ సత్తా చాటిన నటి
బాలీవుడ్ లో దీపికా పదుకొణే రేంజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ వద్ద సోలోగానూ సత్తా చాటిన నటి. ఒంటిచేత్తో 500 కోట్లు తెచ్చిన నటి. 'పద్మావతి' చిత్రంతో తానేంటే నిరూపించింది. దీపిక హీరోల సరసనే నటించా ల్సిన పనిలేదు. సోలోగా కంటెంట్ ఉన్న సినిమాలో నటిస్తే? తానే బాక్సాఫీస్ ని షేక్ చేసే నటి అని ప్రూవ్ చేసింది. ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఒక్కో సినిమాకి 10 నుంచి 15 కోట్ల మధ్యలో పారితోషికం తీసుకుంటుంది.
తన కాల్షీట్లను బట్టి ఈ రకమైన ఛార్జ్ మినిమంగా ఉంటుంది. హీరోయిన్ పాత్ర కాబట్టి పెద్దగా శ్రమించే పనే ఉంటుంది. కాల్షీట్లు కూడా పెద్దగా కేటాయించాల్సిన పనిలేదు. ఏడాదిలో కనీసం ఆరేడు సినిమాలైనా చేసుకునే వెసులు బాటు ఉంటుంది. మరి దీపిక పదుకొణే టాలీవుడ్ పాన్ ఇండియా చిత్రం 'కల్కీ'2898'కి ఎంత ఛార్జ్ చేస్తుంది? ఎన్నికోట్ల అందుకుంటుంది? అంటే భారీ మొత్తంలోనే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇంత వరకూ ఏ బాలీవుడ్ సినిమాకి డిమాండ్ చేయనంతగా కల్కీ కోసం డిమాండ్ చేసి సాధించుకుందని అంటున్నారు. ఈ సినిమా కోసం అక్షరాలు 20 కోట్లకు పైగానే తీసుకుంటుందిట. 20 కోట్లు అనేది కేవలం మినిమం ఫిగర్ అని అంతకు పెరిగే అవకాశం ఉంటుంది తప్ప తగ్గడానికి ఛాన్స్ లేదని విశ్వసనీయ సమాచారం. సినిమాలో తన పాత్ర ఆధారంగా ఎక్కువగానే కాల్షీట్లు కేటాయించాల్సి వచ్చిందిట.
అలాగే పాత్ర కూడా పెద్దది కావడంతో సాహసోపేతమైన సన్నివేశాలు ఉండటంతో అన్నింటిని లెక్క వేసి ఛార్జ్ వేసినట్లు సమాచారం. దీంతో అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా దీపిక చరిత్రకి ఎక్కింది. 20 కోట్లు పారితోషికం ఇంతవరకూ ఏ నటికి ఇవ్వలేదు. అత్యధికంగా 10 నుంచి 15 కోట్ల మధ్యలో తీసుకున్న వారే ఉన్నారు. ఐశ్వర్యారాయ్..కంగనా రనౌత్.. కత్రినా కైఫ్... అలియాభట్ లాంటి భామలు మాత్రమే ఉన్నారు. వాళ్లని ఇప్పటికే దీపిక బీట్ చేసింది. తాజాగా తన రేంజ్ అంతకు మించి అని కల్కీతో ప్రూవ్ చేస్తోంది.