స్టార్ హీరోయిన్ అద్దె గర్భంలో బిడ్డను కంటోందా?
అయితే దీపిక తన మొదటి త్రైమాసికం(మూడు నెలలు)లోనే గర్భధారణ గురించి ప్రకటించి ఉండొచ్చు కదా! అలాంటప్పుడు అప్పుడే బేబి బంప్ కనిపించేందుకు ఆస్కారం లేదు.
ప్రియాంక చోప్రా, నయనతార, సన్నీలియోన్, మంచు లక్ష్మీ ప్రసన్న.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు సరోగసీలో పిల్లల్ని కన్నారు. అద్దెగర్భంలో పిల్లల్ని కనడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఒక కారణం పొడుగుకాళ్ల సుందరి దీపిక పదుకొనే జీవితంలో కనిపిస్తోందనేది ఒక వాదన.
ప్రస్తుతం అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివామ వేడుకలో దీపిక గర్భధారణ గురించి ఊహాగానాలు వ్యాపించగా, బేబి బంప్ కనిపించలేదని కొందరు వాదించారు. అదే క్రమంలో స్వయంగా బిడ్డను ప్రసవిస్తారా లేదా సరోగసీలో బిడ్డను కంటున్నారా? అంటూ మీమాంశ నెలకొంది.
అయితే దీపిక తన మొదటి త్రైమాసికం(మూడు నెలలు)లోనే గర్భధారణ గురించి ప్రకటించి ఉండొచ్చు కదా! అలాంటప్పుడు అప్పుడే బేబి బంప్ కనిపించేందుకు ఆస్కారం లేదు. నాలుగైదు మాసాల్లో బేబి బంప్ బయటపడి బిడ్డను కనే ముందు ఉధృతంగా కనిపించే వీలుంటుంది. సెప్టెంబరు డెలివరీకి గడువు తేదీ అయినందున బేబి బంప్‌ని చూడటానికి ఇంకా సమయం ఉంది.
అయితే బిడ్డను ఎలా కనాలి? అనే నిర్ణయం ఒకరి వ్యక్తిగతమైనది. దాని గురించి ఎవరైనా ఊహాగానాలు సాగించడం సరికాదు. దీపిక గోప్యతను గౌరవించడం చాలా ముఖ్యం.
దీపికా పదుకొణె - రణవీర్ సింగ్ జంట అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ జంట ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. దీపిక కస్టమ్ గౌరీ - నైనికా బ్లాక్ సిల్క్ ఫెయిల్ మిడి డ్రెస్‌లో చాలా అందంగా కనిపించగా, రణవీర్ తెల్లటి సూట్ చమత్కారమైన షేడ్స్‌లో పర్ఫెక్ట్ లుక్ లో కనిపించాడు. వేదిక వద్ద ఈ జంట ఎంతో అందంగా కనిపించింది.