దీపిక బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది కాదు!

అలాంటి న‌టి జీవితంలో ఎన్ని ఎత్తు ప‌ల్లాలు చూసి ఉంటుందో గెస్ చేయోచ్చు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో తానెంత ధైర్య‌వంతురాలే ప్ర‌పంచానికి చాటి చెప్పింది

Update: 2023-11-15 06:38 GMT

బాలీవుడ్ లో ఐశ్వ‌ర్యారాయ్ త‌ర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న న‌టి దీపికా ప‌దుకొణే. అంచ‌లంచెలుగా ఇండ‌స్ట్రీలో ఎదిగి త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌రుచుకుంది. అటుపై ర‌ణ‌వీర్ సింగ్ ని పెళ్లాడి సెల‌బ్రిటీ ఫ్యామిలీ ఇంట కోడ‌లిగా అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత అమ్మ‌డి జ‌ర్నీ మ‌రింత వేగం పుంజుకుంది. ఇక ఎదిగే క్ర‌మంలో ఎన్నో స‌వాళ్లు ఎదుర్కుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ అయిన న‌టి దీపిక‌.

అలాంటి న‌టి జీవితంలో ఎన్ని ఎత్తు ప‌ల్లాలు చూసి ఉంటుందో గెస్ చేయోచ్చు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో తానెంత ధైర్య‌వంతురాలే ప్ర‌పంచానికి చాటి చెప్పింది. నాకు ఏదైనా స‌బబు అనిపిస్తే దాన్ని బ‌లంగా న‌మ్మి ముందుకెళ్లిపోతా. నేను ఎవ‌రికీ బ‌య‌ప‌డే ర‌కాన్ని కాదు. ఢిల్లీ జెఎన్ యూ విద్యార్దుల త‌రుపున అలాగే నిల‌బ‌డ్డా. ఆ స‌మ‌యంలో ఎన్నో బెదిరింపులొచ్చాయి. ర‌క‌ర‌కాల మ‌నుషుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కున్నాను.

అయినా వేటిని లెక్క చేయ‌లేదు. విలువ‌లు ..నిర్బీతి ఉన్న కుటుంబ వాతావ‌ర‌ణంలో పెరిగాను. ఒక‌వేళ నేను చేసింది త‌ప్పు అయితే దాన్ని స‌రిదిద్దు కోవ‌డానికి..సారీ చెప్ప‌డానికి ఏమాత్రం సిగ్గుప‌డ‌ను' అని అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. 2014లో తీవ్ర మాన‌సికం కుంగుబాటుకు గురయ్యాను. ఆ త‌ర్వాత నా మాన‌సిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప‌నిగా భావిస్తున్నాను. తీరిక లేకుండా ప‌నిచేయ‌డం నాకో మార్గంలా క‌నిపించింది.

న‌న్ను నేను ఓ వ‌ర్క్ హాలిక్ గా చెప్పుకోవ‌డానికి గ‌ర్వ‌ప‌డ‌తా. కానీ ప‌నిలో ప‌డిపోయి స‌ర్వం మ‌ర్చిపోయి ర‌క‌ర‌కాల ఇబ్బందులు ప‌డేతంగా మాత్రం ప‌నిచేయ‌ను. అన్నింటికంటే మాన‌సిక ప్ర‌శాంత‌త అనేది చాలా ముఖ్యం. అది లేని జీవితం వ్యర్ధం. అందుకే స్వేచ్ఛ‌కు కావాల్సిన స‌మ‌యాన్ని ఇస్తాను' అన్నారు.

Tags:    

Similar News