డాన్ -3లో దీపిక పదుకొణే ఫిక్సైందా?
రణవీర్ సింగ్ సరసన దీపిక పదుకొణే అయితేనే న్యాయం చేస్తుందని...ఆ స్థానంలో ఆమె తప్ప మరొకరు సెట్ అవ్వరని భావిస్తున్నారు
రణవీర్ సింగ్ 'డాన్' గా పర్హాన్ అక్తర్ 'డాన్ -3'ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సినిమా ప్రారంభించాలని పర్హాన్ ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ ప్యాక్డ్ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్లో చూపించాలన్నది పర్హాన్ ప్లాన్. దీనిలో భాగంగా స్క్రిప్ట్ సహా ప్రతీది ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇక హీరోయిన్ గా రణవీర్ సరసన ఇప్పటికే పలువురు భామల పేర్లు తెరపైకి వచ్చాయి. కృతిసనన్..కియారా అద్వాణీ ఇలా కొంత మంది భామల తెరపైకి వచ్చారు. కానీ పర్హాన్ మనసులో మరో హీరోయిన్ ఉందన్న విషయం చిత్ర వర్గాల నుంచి లీకవుతుంది.
రణవీర్ సింగ్ సరసన దీపిక పదుకొణే అయితేనే న్యాయం చేస్తుందని...ఆ స్థానంలో ఆమె తప్ప మరొకరు సెట్ అవ్వరని భావిస్తున్నారు. దీనికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు తెలుస్తున్నాయి. స్టోరీ పరంగా ఇందులో హీరోయిన్ భారీ యాక్షన్ సన్నివేశాలు చేయాల్సి ఉందిట. రణవీర్ తో పాటు పోటా పోటీగా తలపడాలంట. అలాంటి పవర్ ఫుల్ పాత్రకి అథ్లెటిక్ బాడీ ఉన్న హీరోయిన్ అయితేనే న్యాయం చేయగలదని దీపికని ఎంపిక చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలిసింది.
అలాగే నిజ జీవితంలో ఇద్దరు భార్య భర్తలు. కెమిస్ట్రీ పరంగా దర్శకుడికి పెద్దగా ఇబ్బందులుండవు. ఇంటిమేట్ సన్నివేశాల్లో ఎలా నటించాలో? దర్శకుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రవైసీ కల్పిస్తే ఆ ఇద్దరు వాటిని పూర్తి చేసేస్తారు. ఆరకంగా సినిమాలో కావాల్సినంత రొమాన్స్ ధారాళంగా పండుతుంది. అందుకే దీపిక అయితేనే బాగుంటుందని పర్హాన్ చర్చిస్తున్నట్లు తెలిసింది. అమ్మడికి యాక్షన్ చిత్రాలు కొత్తేం కాదు. కొన్ని సినిమాల్లో హీరోలకు ధీటుగా యాక్షన్ పాత్రలు పోషించింది.
అదే సమయంలో రొమాన్స్ విషయంలోనూ తగ్గింది లేదు. మేకర్స్ అనుకూలంగా పెర్మార్మ్ చేస్తుంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో 'ఫైటర్' అనే భారీ యాక్షన్ సినిమా కూడా చేస్తుంది. ఆ సినిమాకి ఇప్పటికే శిక్షణ కూడా తీసుకుంది. అవన్నీ 'డాన్ -3' సినిమాకి ఉపయోగ పడేవే. ఇలా కొన్ని కారణాలు పర్హాన్ ని లాక్ చేస్తున్నట్లు చెప్పొచ్చు.