.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

#ఫ్యాన్స్‌ గుస‌గుస‌.. దీపిక బిడ్డ పేరు క‌ల్కి?

యాధృచ్ఛిక‌మే అయినా అన్నీ అలా క‌లిసొచ్చాయంటూ ఫ్యాన్స్ దీపిక స‌క్సెస్ కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

Update: 2024-06-29 16:30 GMT

ఇప్పుడు ఏ నోట విన్నా దీపిక ప‌దుకొనే గురించే చ‌ర్చ‌. ప్ర‌భాస్ తో క‌లిసి 'క‌ల్కి 2989 ఎడి' చిత్రంలో అద్భుత పాత్ర‌లో న‌టించిన దీపిక‌(సుమ‌తి పాత్ర‌)పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. అదే స‌మ‌యంలో దీపిక 'ఆన్ స్క్రీన్- ఆఫ్ ద స్క్రీన్ గ‌ర్భం' గురించి కూడా పెద్ద డిబేట్ న‌డుస్తోంది. యాధృచ్ఛిక‌మే అయినా అన్నీ అలా క‌లిసొచ్చాయంటూ ఫ్యాన్స్ దీపిక స‌క్సెస్ కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

'క‌ల్కి 2898 ఎడి' చిత్రంలో దీపిక ప‌దుకొనే గ‌ర్భిణిగా క‌నిపించారు. పైగా భ‌గ‌వంతుని గ‌ర్భంలో మోస్తున్న త‌ల్లిగాను త‌న పాత్ర‌ను ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. మొద‌టి భాగంలో భ‌గ‌వంతునికి జ‌న్మ‌నివ్వ‌క‌పోయినా.. రెండో భాగంలో సుమ‌తి పాత్ర (దీపిక) ప్ర‌స‌వాన్ని చూపిస్తార‌ని అభిమానులు భావిస్తున్నారు. దీపిక‌కు జ‌న్మించే భ‌గ‌వాన్ - క‌ల్కి అని అంతా ఊహిస్తున్నారు.

ఆస‌క్తిక‌రంగా పెద్ద తెర‌పై గ‌ర్భిణిగా క‌నిపించిన దీపిక యాధృచ్ఛికంగా నిజ జీవితంలో కూడా గ‌ర్భిణి కావ‌డంతో త‌న‌కు పుట్ట‌బోయే బిడ్డ ఒక‌వేళ మ‌గ‌పిల్లాడు అయితే అత‌డికి క‌ల్కి అని పేరు పెట్టుకుంటుందా? అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు అభిమానులు. త‌న బిడ్డ క‌డుపులో ఉండ‌గానే, క‌ల్కి లాంటి పాన్ వ‌ర‌ల్డ్ సినిమాలో న‌టించిన దీపిక ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో ఈ ఆనంద స‌మ‌యాన క‌ల్కి భ‌గ‌వంతుని నామ‌ధేయాన్ని సెంటిమెంట్ గా ప‌రిగ‌ణిస్తుంద‌ని, త‌న బిడ్డ‌కు ఇదే పేరు పెట్టుకుంటుంద‌ని కూడా అభిమానులు విశ్లేషిస్తున్నారు.

Read more!

దీపిక ఇప్ప‌టికే భార‌త‌దేశంలో పెద్ద సూప‌ర్‌స్టార్. హాలీవుడ్ లోను న‌టించిన అనుభ‌వం ఉంది. ఇదే స‌మ‌యంలో 'క‌ల్కి 2898 ఎడి' పేరు ప్ర‌పంచ స్థాయిలో మార్మోగుతోంది. భార‌త‌దేశం నుంచి హాలీవుడ్ స్థాయి సినిమా వ‌చ్చింద‌ని అంతా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అటు హాలీవుడ్ లోను ఈ సినిమాకి రివ్యూలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా అమితాబ్, ప్ర‌భాస్ పాత్ర‌ల‌తో పాటు, దీపిక పాత్ర‌పైనా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఈ ఆనంద స‌మ‌యాన్ని రియ‌ల్ గానే బిడ్డ‌ను మోస్తూనే సెల‌బ్రేట్ చేసుకుంటోంది డీపీ.

Tags:    

Similar News