కల్కి పార్ట్ 2… అమె రావడమే ఆలస్యం!
ఫ్యూచర్ లో జరగబోయే కథగా కల్కి చిత్రాన్ని తెరకెక్కించడంతో నాగ్ అశ్విన్ ఇమాజినేషన్ తో ప్రేక్షకులు మూడు గంటలు ట్రావెల్ చేశారు.
కల్కి 2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ టార్గెట్ కి దగ్గరగా ఉంది. డార్లింగ్ ప్రభాస్ ఖాతాలో బాహుబలి 2 తర్వాత మరో వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన మూవీగా కల్కి 2898ఏడీ నిలుస్తుందని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై సృష్టించిన సరికొత్త ప్రపంచం ఆడియన్స్ కి కొత్త లోకంలోకి తీసుకొని వెళ్ళిపోయింది. ఫ్యూచర్ లో జరగబోయే కథగా కల్కి చిత్రాన్ని తెరకెక్కించడంతో నాగ్ అశ్విన్ ఇమాజినేషన్ తో ప్రేక్షకులు మూడు గంటలు ట్రావెల్ చేశారు.
అందుకే కథలో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్న వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే ఈ మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టడంతో వరల్డ్ వైడ్ గా కల్కి 2898ఏడీకి సీక్వెల్ గా రాబోయే మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మొదటి పార్ట్ కి వచ్చిన రెస్పాన్స్ తో పాటు పబ్లిక్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా నాగ్ అశ్విన్ మరల కల్కి 2898ఏడీ పార్ట్ 2 కథపై రీవర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సీక్వెల్ 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందంట.
అయిన కానీ కొన్ని సీక్వెన్స్ ని మళ్ళీ ఫ్రెష్ గా రాసుకొని తెరకెక్కించాలని నాగ్ అశ్విన్ అనుకుంటున్నారు. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పెర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిన తర్వాత షూటింగ్ గురించి ఆలోచించాలని అనుకుంటున్నారు. మరో వైపు దీపికా పదుకునే ప్రస్తుతం గర్భవతిగా ఉంది. ఆమె డెలివరీ తర్వాత కూడా కొన్ని నెలలు షూటింగ్ లకి అందుబాటులో ఉండకపోవచ్చు.
కల్కి 2898ఏడీ పార్ట్ 1లో సుమతి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కల్కికి జన్మనివ్వబోతున్న తల్లిగా ఆమె నటించింది. పార్ట్ 2లో కూడా దీపికా పదుకునే పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసిన కూడా కచ్చితంగా దీపికా పదుకునే పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆమె కూడా పార్ట్ 2 షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది.
అయితే ఇప్పట్లో దీపికా పదుకునే షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ లేదు. స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత కీలక సన్నివేశాలని ముందుగా తెరకెక్కించి తరువాత దీపికా పదుకునే సీక్వెన్స్ ని షూట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అయితే షూటింగ్ ఎప్పుడు ఉంటుంది. ఎలా ముందుకెళ్తారు అనేది నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చే వరకు తెలియదు.