సెప్టెంబర్ లో దీపిక-రణవీర్ బిడ్డకు స్వాగతం!
రణవీర్ సింగ్-దీపికా పదుకొణే జంట శుభవార్త చెప్పేసింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆ గుడ్ న్యూస్ రానే వచ్చేసింది
రణవీర్ సింగ్-దీపికా పదుకొణే జంట శుభవార్త చెప్పేసింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆ గుడ్ న్యూస్ రానే వచ్చేసింది. సెప్టెంబర్ లో రణవీర్-దీపిక తమ మొదటి బిడ్డను ప్రపంచంలోకి స్వాగతం పలుకుతు న్నట్లు దీపిక ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించారు. పుట్టబోయే బిడ్డకు అవసరమయ్యే అన్నింటిని ఇన్ స్టా లో ఓ డిజైన్ రూపంలో పోస్ట్ చేసి విషయాన్ని అధికారకం చేసారు.
దీంతో ఈ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. సెలబ్రిటీలు.. అభిమానులు..సన్నిహితులు..స్నేహితులు అంతా ఆ జోడీ విషెస్ తో ముంచెత్తుతున్నారు. వాస్తవానికి దీపిక గర్భవతి అంటూ కొన్ని రోజులుగా నెట్టింట ప్రచారం జోరుగా సాగుతూనే ఉంది. 77వ బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్ లో రెడ్ కార్పెట్‌పై దీపిక మెరిసిన సమయంలో ఆమె గర్భవతా? అన్న సందేహం తెరపైకి వచ్చింది.
ఆమె తన బేబీ బంప్ కవర్ చేసిందంటూ బాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడ్డింది. తాజాగా ఆ సందేహమే నిజమైంది. ఏకంగా బేబి పుట్టబోయే నెలనే ప్రకటించి సర్ ప్రైజ్ చేసారు. ఇదే సమయంలో దీపిక టాలీవుడ్ లోనూ 'కల్కీ 2898' చిత్రంతో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె షూటింగ్ లో పాల్గొనడం మొదలైంది. అయితే ఆమె పై చిత్రీకరణ మొత్తం పూర్తయిందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
'కల్కీ' మే 9న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే అంటే సరిగ్గా రెండు నెలలు సమయం ఉంది. కానీ టీమ్ ఇంకా షూట్ లో ఉంది. ఈ నేపథ్యంలో దీపిక భాగం పూర్తి చేస్తే? ఇబ్బంది లేదు లేకపోతే గర్భవ తిగానే షూట్ లో పాల్గొనాల్సి ఉంటుంది. అలాగే బాలీవుడ్ లో 'సింగం ఎగైన్' లోనూ నటిస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి దీపిక పార్టు పూర్తయింది. కొత్త సినిమాలేవి సైన కూడా చేయలేదు. దీంతో కల్కీ విషయంలోనే క్లారిటీ లోపిస్తుంది.