దీపికా.. కల్కితో మరో బిగ్ రికార్డ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ప్రస్తుతం పాన్ వరల్డ్ హీరోయిన్ గా తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది.

Update: 2024-06-28 09:14 GMT

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ప్రస్తుతం పాన్ వరల్డ్ హీరోయిన్ గా తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. అలాగే అత్యధిక బ్రాండ్ వేల్యూ ఉన్న హీరోయిన్స్ లో దీపికా పదుకునే నెంబర్ వన్ స్థానంలో ఉంది. కెరియర్ ఆరంభంలో కన్నడంలో ఉపేంద్రకి జోడీగా ఆమె తన మొదటి సినిమా చేసింది. తరువాత షారుఖ్ ఖాన్ ఓం శాంతి మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.


అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. హాలీవుడ్ మూవీలో కూడా దీపికా పదుకునే నటించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ గా దీపికా పదుకునే ఉంది. ఈమె గత ఏడాది షారుఖ్ ఖాన్ కి జోడీగా పఠాన్, జవాన్ సినిమాలలో నటించింది.

ఈ రెండు సినిమాలు వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టాయి. బ్యాక్ టూ బ్యాక్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాలలో భాగమైన హీరోయిన్ గా దీపికా పదుకునే అరుదైన ఘనత సాధించింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ లీడ్ రోల్ చేసిన కల్కి 2898ఏడీ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ నటించిన పాన్ వరల్డ్ మూవీగా ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.

ఈ మూవీలో కల్కికి జన్మనివ్వబోయే తల్లిగా దీపికా పదుకునే పాత్ర ఉంటుంది. మూవీలో ఆమె పాత్ర చాలా బలంగా, పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండేలా ఉంది. దీపికానే ఆ క్యారెక్టర్ ని బెస్ట్ ఛాయస్ అని సినిమా చూసినవారు అంటున్న మాట. ఇదిలా ఉంటే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. కల్కి కూడా 1000 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

అదే జరిగితే వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన మూడు సినిమాలలో భాగమైన హీరోయిన్ గా దీపికా ఖాతాలో అరుదైన రికార్డ్ చేరుతుంది. నటిగా ఆమె చాలా ఎత్తులో ఉంది. కల్కి తర్వాత కూడా ఆమె ఇండియన్ హాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు పొందడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. మొదటి రోజే కల్కి 200+ కోట్లకి పైగా కలెక్ట్ చేసి ఉంటుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. వీకెండ్ అయ్యేలోపు 500+ రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే వేగంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలు ఉండటంతో వెయ్యి కోట్లు చాలా ఈజీగా అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News