బిడ్డొచ్చే వేళ స్టార్ హీరో చేసిన పనికి షాక్!
అయితే రణవీర్ సింగ్ ఇన్‌స్టా ఖాతాలో పెళ్లి ఫోటోలు సడెన్ గా మాయమవ్వడం ఆశ్చర్యపరిచింది. దీప్‌వీర్ అని ఈ జంటను అభిమానులు ఎంతో ముద్దుగా పిలుచుకుంటారు.
ఈ పాపులర్ జంటకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అభిమానులకు అన్నివేళలా ఈ దంపతులు గోల్ సెట్టర్స్. కానీ ఇప్పుడు ఒక ఊహించని ఘటన. త్వరలోనే ఆ ఇంటికి ఒక బుల్లి అతిథి రాబోతున్నాడు. తల్లిదండ్రులుగా ఈ జంట ప్రమోషన్ అందుకోబోతున్నారు. కానీ ఇప్పుడు అతడు తమ పెళ్లి ఫోటోలను తొలగించి ఆశ్చర్యపరిచాడు. ఇదంతా ఎవరి గురించి? అంటే.. రణవీర్ సింగ్ -దీపికా పదుకొనే జంట గురించే. ఈ జంట తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు! రెండవ త్రైమాసికంలో దీపిక తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తోంది.
అయితే రణవీర్ సింగ్ ఇన్‌స్టా ఖాతాలో పెళ్లి ఫోటోలు సడెన్ గా మాయమవ్వడం ఆశ్చర్యపరిచింది. దీప్‌వీర్ అని ఈ జంటను అభిమానులు ఎంతో ముద్దుగా పిలుచుకుంటారు. నవంబర్ 2018లో ఈ జంటకు పెళ్లయింది.
దీపిక కొంకణి వారసత్వాన్ని గౌరవిస్తూ, అలాగే రణ్‌వీర్ సింగ్ సింధీ కల్చర్ వివాహ సంబరాన్ని గౌరవిస్తూ బోలెడన్ని వీడియోలు ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ అరుదైన పెళ్లి జ్ఞాపకాలు రణవీర్ గ్రిడ్ నుండి అదృశ్యమయ్యాయి. దీంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. వీటిని తొలగించారా లేదా ఆర్కైవ్ చేసారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
సడెన్ గా ఇలా సోషల్ మీడియా నుంచి ఫోటోల తొలగింపు దేనికి? అంటూ చాలామంది ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల దీపిక సౌకర్యవంతమైన ప్రసూతి దుస్తులలో కనిపించిన ఫోటో వైరల్ అయింది. బేబి బంప్ ఈ దుస్తుల్లో స్పష్ఠంగా కనిపిస్తుంది. దీపిక గర్భిణిగా ఉండగానే సింగం ఎగైన్ లో నటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2024లో జూనియర్ దీపిక జన్మిస్తుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు రణవీర్ హనుమాన్ దర్శకుడితో ఓ సినిమాకి సన్నాహకాల్లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.